Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jillellamoodi amma

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (మార్చి 28 - మార్చి 03) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది కావున ప్రణాళికతో వ్యవహరించుట మూలాన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమాలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. కొంతమేర ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. సోదరవర్గం నుండి వచ్చే వార్తలు మీకు కొంత ఇబ్బందిని కలుగజేసేవిగా ఉంటాయి. విద్యార్థులకు స్నేహితులతో సరదాగా గడుపుటకు ప్రయత్నం చేస్తారు కాకపోతే చదువు విషయంలో కూడా ఉన్నతమైన నిర్ణయం దిశగా అడుగులు వేయండి మంచిది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది కాకపోతే ప్రయాణాల మూలాన శ్రమను పొందుతారు. అధికారులతో కలిసి నూతన పనులను చేపడుతారు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. కళారంగంలోని వారికి కొత్త కొత్త అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.


వృషభ రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులకు సంబంధించి అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటూనే ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సారించుట మంచిది. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట ద్వారా మంచి పేరును తెచ్చుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. పెద్దల అభిప్రాయాలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. విద్యార్థులకు నూతన అవకశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు ఉండే అవకాశం ఉంది. పనులపైన శ్రద్ధను చూపుట ఉత్తమం. నూతన పనులను చేపడుతారు. వ్యాపారస్థులకు శ్రమఉంటుంది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకున్నను ఇబ్బందులు కలుగవు. కళారంగంలోని వారికి దైవ సంబంధమైన పనులకు సమయాన్ని ఇస్తారు. కొంత నిదానం అవసరం.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో కలిసి చేయుప్రయత్నాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చును. అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చులు చేపట్టిన పనుల మూలాన అవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ద వద్దు. విద్యార్థులకు శ్రద్దతగ్గిపోతుంది ఈ విషయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం. అలాగే పెద్దల మాటను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో మాటను పడవలసి వస్తుంది కావున ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతిపనిలో నిదానం అవసరం. వ్యాపారస్థులకు పనులు పెరుగుతాయి ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు కొంత ఆలస్యంగా అందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన పనులతో సమయాన్ని చాలావరకు బిజీగా గడిపేస్తారు. 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. వారం చివరలో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. దానం విషయంలో ప్రయోగాలు చేయకపోవడం మంచిది. అధికారులతో కలిసి పనిచేస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు,అలాగే చర్చాసంబంధమైన విషయాల్లో మాత్రం నలుగురి ఆలోచనలు వినే ప్రయుత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త అవసరం లేకపోతే వారివిషయంలో ఆందోళన తప్పకపోవచ్చును. విద్యార్థులకు పోటీపరిక్షల విషయంలో పెద్దల సూచనలు ఉపయోగపడుతాయి. అధికభాగం సమయం చదువుకు ఇవ్వడం మంచిది. ఉద్యోగులకు కొంత ఇబ్బందికాలంగానే చెప్పుకోవచ్చును, అకారణంగా విభేదాలు తప్పవు. వ్యాపారస్థులకు బాగుంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కళారంగంలోని వారికి కుటుంబపరంగా భాద్యతలు పెరుగుతాయి అలాగే నూతన పరిచయాలు అయ్యే అవకాశం ఉంది.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబంలో మాత్రం పెద్దల లేదా అనుభవజ్ఞుల సూచనలు పాటించుటకు ప్రయత్నం చేయుట మంచిది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. చేపట్టు పనులకు సంబంధించిన విషయాల్లో ప్రణాలిక అవసరం. సమయం విషయంలో సరైన ఆలోచనలు చేయుట ద్వార పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. మాటలు పొదుపుగా వాడుట వలన విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు సమయాన్ని సరదాగా గడపాలనే తలంపు ఉటుంది కాకపోతే చదువును అశ్రద్ద చేయకండి. నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొంత చికాకు తప్పదు అనవసరపు పనులను చేపట్టవలసి రావొచ్చును వ్యాపారస్థులకు పెద్దల ఆశీర్వాదం వలన మేలుజరుగుతుంది. నూతన వ్యాపారాలు ఆరంభించే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది, నూతన ప్రయత్నాలు చేస్తారు.


కన్యా రాశి

ఈవారం మొత్తంమీద విందులు, వినోదాల్లో పాల్గొనాలనే ఆకాంక్ష ఉంటుంది ఆదిశగా అడుగులు వేస్తారు. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇవ్వడం చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు భోజనసౌఖ్యంను కలిగిఉంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు అవసరం. అనారోగ్యం వలన ఇబ్బందులు తప్పవు కొంత విశ్రాంతిని కోరుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది పోటీపరిక్షలకు సమయాన్ని ఇస్తారు దానితో పాటు సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే విజయం పొందుతారు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో గల సత్సంభందాలు మేలుచేస్తాయి. నూతన అవకాశాలకు చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. కళారంగంలోని వారికి వ్యాపారపరమైన విషయాల పట్లమక్కువ పెరుగుతుంది.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. శ్రమను కలిగి ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. విద్యార్థులకు కష్టకాలమే కావున ఉన్నతమైన ప్రణాలిక అవసరం సమయపాలన వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి,  తొందరపాటు వద్దు చిన్న చిన్న పనులను పూర్తిచేసే ప్రయత్నం మొదలు పెట్టుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెద్దలతో గుర్తింపును పొందుతారు అదేవిధంగా వారిసూచనలు పాటించుట చేయండి . కళారంగంలోని వారికి నిదానంగా పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది ఓపిక అవసరం. 

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు చేయక గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట వారికి దూరంగా ఉండుట మంచిది. వారం చివరలో మీ ఆలోచనల్లో మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. సరదగా గడుపుటకు ఇష్టపడుతారు. విద్యార్థులకు ఓపిక అవసరం పెద్దల సలహాలను పాటించుట వలన కొంత మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది కాకపోతే అధికారులతో సత్సంభందాలు ఉన్నచో మేలుజరుగుతుంది లేకపోతే చిన్న చిన్న సమస్యలు తప్పవు. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు పెరుగుతాయి అలాగే గతంలో చేపట్టిన పనుల వలన లాభం పొందుతారు. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలుగుతాయి చేపట్టినపనులు నిదానంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద పనులకు సంభందించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగుంటుంది రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. రాజకీయపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు శ్రమపొందుట చేత ఉన్నతమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పోటిపరిక్షల్లో రాణిస్తారు ముందుకు వెళ్ళండి. ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. సర్దుబాటు విధానం అవసరం అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టవచ్చును. కళారంగంలోని వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి నూతన పనుల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. 


మకర రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదావేయుట సూచన. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది ముఖ్యంగా దీర్ఘకాలికప్రయోజనాలు చూసుకొని ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరిగనను ఇబ్బందులు ఉండవు. కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాటవిషయంలో నిదానం అవసరం వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి పనిఒత్తిడి ఉంటుంది ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే మేలుజరుగుతుంది.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దలను కలిసే ఆస్కారం కలదు వారితో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. శుభాకార్యములలో పాల్గొంటారు దైవసంబంధమైన విషయాలకు సమయం ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. కుటుంబపెద్దతో చర్చలు చేయునపుడు నిదానం అవసరం లేకపోతే మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు. విద్యార్థులకు బాగానేఉంటుంది ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది, చిన్న చిన్న విషయాలకే హైరానాపడకండి. ఉద్యోగులకు స్థిరమైన ఆలోచనలు చేసినచో మేలుజరుగుతుంది. తోటివారిని కలుపుకొని వెళ్ళండి కొన్నివిషయాల్లో సర్దుబాటు అవసరం. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కళారంగంలోని వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చును ఓపికఅవసరం.


మీన రాశి

ఈవారం మొత్తంమీద పనులను నిదానంగా చేపట్టుట ఉత్తమం. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు భోజనసౌఖ్యం ఉంటుంది. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది దానిమూలాన మానసికంగా శ్రమను పొందుతారు. శ్రమపెరుగుతుంది మిత్రులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ప్రయాణాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును కావున వాయిదావేయుట మంచిది. విద్యార్థులకు సమయంవృధా అయ్యే అవకాశాలు కనభడుతున్నవి కావున పెద్దలు వీరిని కనిపెట్టుకొని ఉండుట మంచిది. సమయపాలన అవసరం. ఉద్యోగులకు అధికారుల మూలాన కొంత శ్రమపెరుగుతుంది ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు కొంత నిదానం అవసరం సమయానుకూలంగా నడుచుకోండి లేకపోతే మిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది పెద్ద పెద్ద అవకాశాలు పొందుతారు, సంతోషంగా ఉంటుంది.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
panchanga shravanam