Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
teetani kalavo audio launch

ఈ సంచికలో >> సినిమా >>

మే 1న 'మేన్ ఆఫ్ ది మ్యాచ్'

may 1st man of the match

అభి స్టూడియోస్ పతాకంపై 'తమ్ముడు' ఫేం పి.ఎ. అరుణ్ ప్రసాద్  దర్శకత్వంలో బి. సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'మేన్ ఆఫ్ ది మ్యాచ్'. నిర్మాత బి.సత్యనారాయణ కుమార్తెలు మాధురి - మాధవి కథను అందించిన ఈ చిత్రంలో 'మొగలి రేకులు' ఫేం సాగర్ - మృదుల జంటగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటులు నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ - రాశి కలిసి నటిస్తున్న చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత బి.సత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా బి.సత్యనారాయణ మాట్లాడుతూ... 'నిర్మాతగా నా తొలి చిత్రంగా నిర్మించిన 'మేన్ ఆఫ్ ది మ్యాచ్' బిజినెస్ నేననుకున్న దానికంటే బాగా జరిగింది. 'మొగలి రేకులు' సీరియల్ ద్వారా అందరికీ సుపరిచితుడైన సాగర్ ఈ చిత్రంలో హీరోగా పరిచయమవుతుండడం, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ - రాశిలు చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో జంటగా నటించడం, చిన్ని చరణ్ అందించిన బాణీలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం వంటి అంశాలన్నిట్నీ పరిగణలోకి తీసుకొనప్పుడు... 'మేన్ ఆఫ్ ది మ్యాచ్' సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రేక్షకులు మా నమ్మకాన్ని నిజం చేస్తారని ఆశిస్తున్నాను' అన్నారు!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam