Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

బుర్రకథ షూటింగ్

burrakatha shooting

బుర్రకథలు జనం మర్చిపోయి చాలా కాలం అయ్యింది. గతంలో దూరదర్శన్ ఒక్కటే వినోదాంశంగా ఉండే రోజుల్లో బుర్రకథలు వస్తూండేవి. కానీ ఇప్పుడు ప్రైవేటు చానల్స్ వచ్చాక అవి కనుమరుగయిపోయాయి.

తాజాగా వస్తున్న "లేడీస్ అండ్ జెంటిల్మెన్" చిత్రం కోసం రఘు కుంచె స్వరపరచగా సిరాశ్రీ ఒక బుర్రకథ రాసారు. అది కూడా ఇంటెర్నెట్ గురించి. ఈ పాట సినిమాలో నేపధ్య గీతంగా వస్తుంది. అయితే ప్రచార నిమిత్తం ఈ బుర్రకథని రఘు కుంచె, జూనియర్ రేలంగి, ర్యాప్ సింగర్ నియోల్ ల పై చిత్రీకరించారు.

ఈ చిత్రానికి మంజునాథ్ దర్శకుడు కాగ, మధుర శ్రీధర్ అన్నిటా అంతటా ఉండి నిర్మిస్తున్నారు. గోతెలుగు డాట్ కాం సమర్పిస్తున్న ఈ చిత్రంలోని ఆ బుర్రకథ త్వరలోనే మీ ముందుకొస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Rey chitraniki ram voice over