‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ సినిమా కోసం రూపొందించిన ‘సోషల్ నెట్ వర్క్ అండీ బాబూ’ పాట సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ పాటకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ‘పాట అద్భుతం..’ అనే ప్రశంసలు తెలుగు సినీ ప్రముఖులనుంచి వస్తున్నాయి. తక్కువ టైమ్‌లో ఈ పాట చాలా పాపులర్ అవడంతో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పాటపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఓ బాలీవుడ్ ప్రముఖుడు ఈ పాటని హిందీ, ఇంగ్లీష్‌లలో (హింగ్లీష్‌లో) రూపొందించండి అని ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్ర నిర్మాతల్ని కోరారట. దాంతో తెలుగు పాటని రాసిన సిరాశ్రీతో ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతలు పంచుకున్నారట. వారి కోరిక మేరకు సిరాశ్రీ, హిందీ ` ఇంగ్లీష్‌లో ఇదే పాటకి లిరిక్స్ రాయడం జరిగింది.
‘సున్ రే భయ్యా.. జగ్ నే పాయా ఇంటర్నెట్..’ అంటూ సాగే హిందీ`ఇంగ్లీష్ పాట ప్రస్తుతం మిక్సింగ్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ప్రపంచాన్ని ఊపేసిన ‘కొలవెరి’ పాట తరహాలో ఈ ‘సోషల్ నెట్‌వర్క్ అండీ’ హిందీ ` ఇంగ్లీష్, తెలుగు పాట ప్రాచుర్యం పొందుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. గో తెలుగు నిర్మాణంలో ఈ ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ సినిమా రూపుదిద్దుకుంటోంది.
|