Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavan sri satya sai

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం ( నవంబర్21 నుండి నవంబర్ 27 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల వలన మేలుజరుగుతుంది. పెద్దలనుండి వచ్చిన సూచనల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది కావున అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిత్రులనుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రయాణాలు చేయడం వలన స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యతిరేకవర్గం నుండి వచ్చు ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు నూతన ప్రయత్నాలు చేస్తారు.

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. సోదరవర్గంతో చర్చలు జరుపుటకు అవకాశం ఉంది వారినుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం కలదు. వ్యతిరేకవర్గం వారిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలను తీసుకొనే అవకాశం శం కలదు. ఉద్యోగంలో పనిఒత్తిడి తప్పకపోవచ్చును సమయానుకూలంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. నిర్ణయాలు తీస్కోనే ముందు బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి.

 

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద మీరు తీసుకొనే నిర్ణయాలు చాలావరకు నూతన మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. చిననాటి మిత్రులను కలవడం అలాగే స్నేహితులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయల్లో బాగానే ఉంటుంది కాకపోతే కొన్ని ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. స్త్రీ సంభందమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉండే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో నిదానంగా వ్యవహరించుట అలాగే వారికి సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు తరచు చేయవలసి రావోచ్చును ఈ పరంగా కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలను కలుస్తారు వారికి అనుకూలంగా వ్యవహరించుట మంచిది.  

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం తప్పక పోవచ్చును. నలుగురిలో పనిచేసే సమయంలో వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేయుట ద్వార పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు కళ్ళెం వేయండి అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి ఉత్తమం. ఇష్టమైన వ్యక్తుల లేదా మీ శ్రేయోభిలాషుల మూలాన కొన్ని కొన్ని పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ప్రయాణాలు మిమ్మల్ని చికాకు పెట్టుటకు అవకాశం ఉంది ఈ విషయంలో సర్దుబాటు అలాగే ఓపిక అవసరం. కుటుంబంలో అందరి సహకరం ఉండుట వలన సంతృప్తిని పొందుతారు.   

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దల సూచనల మేర నడుచుకొనుట చాలావరకు మేలుచేస్తుంది. అనుకున్న పనులను మిశ్రమఫలితాలతో పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది తప్పకపోవచ్చును. ఉద్యోగంలో అధికారులనుండి ఒత్తడి ఉంటుంది కాకపోతే నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు సరిగా లేకపోతే నూతన్ సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఆచితూచి వ్యవహరించుట ఉత్తమం. సంతాన పరమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కలదు తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. కుటుంబంలో ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. తలపెట్టిన ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది.  

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద మీయొక్క మాటతీరు చలవిషయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మిశ్రమఫలితాలు కనభడుతున్నవి. బాగా శ్రమించుట ద్వార కొద్దిపాటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ఇష్టమైనపనులకు సమయం ఇస్తారు నచ్చిన వారిద్వార నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది వారితో సమయం గడుపుతారు. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.  

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నిర్ణయాలు తీసుకొనే ముందు ఒక్కసారి ఆలోచన చేయుట మంచిది. ఉద్యోగంలో లేక ఉద్యోగ ప్రయత్నాలు ఓ మోస్తరు ఫలితాలను ఇచ్చుటకు అవకాశం కలదు నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు కొంత జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. నచ్చినవ్యక్తులను కలుస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది.   

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. కుటుంబసభ్యుల సహకారం వలన నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. మీయొక్క మాటతీరు మాత్రం మిత్రులతో లేక తోటివారితో విభేదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. శుభకార్యములు జరుగుటకు అవకాశం ఉంది వీటి విషయంలో సమయం ఇస్తారు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసికంగా కొంత ఆందోళనలు పెరుగుటకు అవకాశం ఉంది సమయానికి భోజనం చేయుట విశ్రాంతి అవసరం. అనవసరమైన ఆలోచనలకు సమయం ఇవ్వడం మూలాన నూతన సమస్యలను పొందుటకు అవకాశం ఉంది.

 


ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట అలాగే నూతన నిర్ణయాలు తీసుకొనుట అవసరం. చాలావరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనమునకు సంభందించిన విషయాల్లో ఊహించని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే విషయంలో మీ ఆలోచనలు విఫలం చెందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో కొంత ఇబ్బందులు కలిగినను వాటింతట అవే సద్దుమనుగుట వలన కొంత ఊరట చెందుతారు. ప్రయాణాలు మీకు పెద్దగా కలిసి రాకపోవచ్చును. పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు వారి సూచనలకు అనుగుణంగా నడుచుకొనుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటారు కొన్ని కొన్ని విషయాల్లో బాధకు లోనయ్యే అవకాశం కలదు.   

 

మకర రాశి

......ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. స్త్రీ / పురుష పరమైన విషయాల వలన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో బాగుంటుంది అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీస్కోండి వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది లేదా అగ్నిసంభందమైన విషయాల్లో పనిచేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో వచ్చిన మార్పుల విషయంలో కొంత అయిష్టత కలిగి ఉండే అవకాశం ఉంది సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. మిత్రులను కలుస్తారు.     

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా సంతోషంగా గడిపే అవకాశం కలదు. నూతనప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం ఉంది అనుకూలమైన ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు మిత్రులతో కలిసి సమయన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది అధికారుల నుండి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంవిషయంలో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మీ మాటతీరు మార్చుకోవడం మేలు.   

 


మీన రాశి
ఈ వారం మొత్తంమీద బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది తొందరపాటు దొరని వద్దు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు మీ స్థాయి దాటిపోవుటకు అవకాశం కలదు జాగ్రత్త. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. మిత్రులనుండి వచ్చు సూచనలు అలగే సలహాలను పాటించుట చేత కొంత ఇబ్బందులు తగ్గుటకు అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు కొంత ఉత్సాహంను నింపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కొన్ని కొన్ని మొండినిర్ణయాలు తీసుకుంటారు అలాగే నచ్చిన వ్యక్తులతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Peetala Iguru