సినిమా విడుదల కాకుండానే కొన్ని సినిమాలకు మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది. ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా ఈ టాక్ బయటకు వస్తుంటుంది. ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’కి అలాంటి స్పందనే వస్తోంది. మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గో తెలుగు డాట్ కామ్ సమర్పణలో ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిరాశ్రీ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా పట్ల బయ్యర్లు కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించే అవకాశాలున్నాయంటున్నారు. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం యూత్‌ని ఆకట్టుకునే విభిన్నమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందట.
నేటి యువతకు మంచి మెసేజ్ ఇచ్చేలా, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకుల ప్రశంసలు అందుతాయని నిర్మాత చెప్పారు. ప్రీ రిలీజ్ టాక్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమా మంచి విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు నిర్మాత మధుర శ్రీధర్.
|