Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meghana

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : షహనాజ్ అలవోకగా చేసిన కొన్ని ట్యూన్లు విని పరవశ్స్తారు, మ్యూజిక్ డైరక్టర్ యోగి, జీవన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో తమతోబాటు ఉండాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తారు. జీవన్ తన వెబ్ సైట్ గురించి వివరిస్తుంటాడు..
ఆ తర్వాత



“అడ్రస్..?” అన్నాడు.

“ఫిల్మ్ డైరెక్టర్ జీవన్ డాట్ నెట్” అన్నాడు జీవన్.

చాలా ఫాస్ట్ గా ఓపెనయింది. జీవన్ ఫస్ట్ ఫిల్మ్ నించీ ఫోటోలూ, జీవన్ మీద ఆర్టికల్సూ, ఫిల్మోగ్రఫీ, మిత్రులు రాసిన ఆర్టికల్సూ, వేరే దేశం... వాటన్నిటినీ చూసుకుంటుంటే చాలా సంబరంగా ఉంది జీవన్ కి.

“ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ సైట్ ని..?” అడిగేడు వేణు.

“అమెరికా లో ఉండే నా మిత్రులు” చెప్పేడు జీవన్.

అంతలో బాగా తయారయిన యోగి దిగేడు.

పబ్ లో అమ్మాయిలూ అబ్బాయిలూ మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలాళ్ళు తాగుతా, సిగరెట్లు కాలుస్తా కనిపిస్తున్నారు అద్దాల్లోంచి. అంతలో హోటల్ని ఆన్చి ఉన్న చర్చి పక్కలోంచి వచ్చిన ఒక అందమైన అమ్మాయి పబ్ లోకెళ్ళి పోయింది.

“ఏంటండీ బొత్తిగా అర్థం గావటం లేదు వీళ్ళ గొడవ” అన్నాడు వేణుతో...

“లోపలికెళదాం రండి చూద్దురు గానీ...” అన్నాడు.

“వద్దులెండి ఇవాళ్టినించీ తాగకూడదు అనుకుంటున్నాను” అన్నాడు జీవన్.

“మేం తాగుతుంటాం, మీరు మంచి నీళ్ళు తాగుదురు గానీ రండి” అనే సరికి వేణు కూడా లోపలికెళ్ళారిద్దరూ. తిని తాగి సిగరెట్లు కాల్చుకుంటూ వెళ్ళిపోతున్న అమ్మాయిలూ ముగ్గురు ఎవరి బిల్లూ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. “అదేంటి..?” అని వేణునడిగితే “ఇంతే ఇక్కడ పద్దతి. ఆ ముగ్గురి బుల్లు పొరపాటున ఒక్కరు ఇవ్వడం జరిగితే అది చాలా గొప్ప వీళ్ళకి” అన్నాడు.

స్టీవర్డ్ వచ్చింది. రెండు గ్లాసులు రాడ్లర్ బీరూ ఒక గ్లాసుడు టాప్ వాటరు ఆర్డరు చేసేడు వేణు.“ఇంకా చెప్పండి వీళ్ళ గురించి...” అన్నాడు జీవన్.

“వీళ్ళలో ఎవరైనా మినిమమ్ టెన్త్ క్లాస్ చదవాలి. ఆ చదివేప్పుడే ఎవడి ఫ్యూచర్ గురించి వాడు ఆలోచించుకుంటారు. ఆ టెన్త్ అయ్యాకా ట్రక్కు నడుపుకోవాలని నిర్ణయించుకున్నవాడు దానికి సంబంధించిన చదువు, విమానం నడపాలని అనుకున్నవాడు దానికి సంబంధించిన చదువూ చదువుకుంటారు. యుక్త వయసు వచ్చాకా తల్లిదండ్రులు వాళ్ళనొదిలేస్తారు. మనలాగ సంబంధాలు చూడ్డమనేవి ఉండదు. వీళ్ళకి ఎవరికి తగ్గ మనిషిని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే” వేణు గారు అలా చెపుతుండగా బస్సొచ్చి ఆగింది. షూటింగ్ కెళ్ళిన జనమంతా దిగుతున్నారు.

హరిప్రియ, నాగరా ఆపరేటర్ని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి ప్రాక్టీసు చేయిస్తున్నాడు డాన్స్ మేష్టారు. అంతలో పరుగు పరుగున అక్కడి కొచ్చేసిన అనిల్ చాలు చాలు పొద్దుట్నుంచీ చాలా అలిసిపోయింది అన్నాడు డాన్సు మేష్టారుతో.

“సెకండ్ బీ.జీ.ఎమ్ లో సరిగ్గా రావడం లేదు మూమెంట్సు” అన్నాడు డాన్స్ మేస్టరు.

“నిజమే.... ఇప్పుడు రిహార్సల్సు పెడితే మొత్తం డల్ అయిపోద్దిగదా రేపటికి...?” అని ఆపించేశాడు రిహార్సలు.బస్సు డ్రైవర్ ఉల్ఫీ వచ్చి ఒక కాఫీ, ఒక బీరూ, ఒక జ్యూసూ ఆర్డర్ చేసి ఒకోటీ కొంచెం కొంచెం తాగుతున్నాడు.

“ఇదేంటండీ వీడికేవన్నా మెంటలా...?” అన్నాడు యోగి.

నవ్వేసిన వేణు “వీళ్ళ పద్దతి ఇంతే. మీకింకో విషయం తెల్సా..? అతనప్పుడే డిన్నర్ చేసేసేడు. ఇక్కడికొస్తున్న వాళ్ళంతా డిన్నర్ తినేసి వస్తున్న వాళ్ళే. ఖాళీ కడుపుతో వీళ్ళు తాగరు. మనలాగ తాగి కొట్టుకోడాలు తూలుకుంటూ వెళ్తా ఏ రోడ్డు పక్కనో పడిపోవడాలూ చెయ్యరు” అన్నాడు.

“పొద్దుట ఆరు గంటల నుంచీ తెరిచే ఉందే ఈ బారు...?” అంటే “అవును, పొద్దుట్నుంచీ తాగుతుంటారు.... జర్మనీలో అయితే బీరు మంచి నీళ్ళలాగ తాగుతారు” అన్నాడు.

“అదేంటి...?” అన్నాడు జీవన్.

“అక్కడ ఒక సీసా మినరల్ వాటర్ రేటెంతో బీరు రేటూ అంతే” అన్నాడు వేణు.

పేపర్ స్టాండులో పెట్టి ఉన్న ఆరోజు న్యూస్ పేపర్ల మీద హాలీవుడ్ ఏక్టర్ చార్లెస్ బ్రాన్ సన్ ఫోటో వేసి ఉంది. దగ్గరకెళ్ళి పేపర్లన్నీ చూసేడు జీవన్. ప్రతి పేపరు ఫ్రంట్ పేజీ మీద నిన్నటి తరం హీరో అయిన బ్రాన్ సన్ ఫోటోలే కనిపించాయి. ఆ పేపర్లన్నీ జర్మన్ లో ఉండటంతో ఉల్ఫీ దగ్గరకి పట్టుకెళ్ళి అడిగితే... నిన్న అంటే ఆగస్టు 30 న న్యూమోనియాతో చనిపోయేడట బ్రాన్ సన్.

అయితే..,

అతను కుర్రాడేం కాదు, పోయే నాటికి అతని వయసు 81 సంవత్సరం. గన్స్ ఫర్ సాన్ సెబాస్టియన్, ఫ్రమ్ నూన్ టిల్ త్రీ, డెత్ విష్ లాంటి చిత్రాల్లో నటించిన నిన్నటి తరం యాక్షన్ హీరో బ్రాన్ సన్. విశేషమేంటంటే భార్యతో ఎక్కువ సినిమాల్లో నటించాడు బ్రాన్ సన్. అతని సినిమాల్లో ఒక మంచి సినిమా ఇటాలియన్ డైరెక్టర్ సెర్జియోలియోన్ తీసిన ఒన్స్ అపాన్ టైమ్ ఇన్ వెస్ట్.

రాత్రి ఎనిమిదిన్నర అయింది.

భోజనాలు చెయ్యడానికిచ్చిన హాలులోకి వెళ్ళారంతా. ఇవాళ పోర్కు, చికెన్, మన కోసం స్పెషల్ గా చేయించాను. నా కోసం తాగేయండి. మీకేవన్నా అయితే ఇన్స్ బ్రూక్ లో ఉన్న పెద్ద హాస్పిటల్ కి నేను తీసుకెళతాను. తప్పులేదు.... గడ్డ కట్టించే చలి, మన వాళ్ళంతా తాగుతున్నారు అన్నాడు వేణు.

జార్జి ప్రసాదు, జీవన్ కోసం రెండు లీటర్ల బకార్డీ తీసుకొచ్చేడు.

తాగడం మొదలెట్టారు.

కాస్సేపయ్యింది.

యూనిట్లో వాళ్ళు భోజనాలకి వస్తున్నారు. వేణు గారు ఫోన్ చేస్తే కెమెరామేనూ, డైరెక్టర్ వచ్చారు. ఆ వేళ వర్క్ ప్రోగ్రెస్ గురించీ, కాస్సేపు జోకులూ కేకలూ అయ్యాక ప్రొడ్యూసరు సలీం వచ్చాడు. “మిమ్మల్ని కలవడమే కుదరడం లేదు. ఇన్స్ బ్రూక్ హోటల్లో పెట్టిన హీరో సందేష్ కి ఏం అవసరమో చూసుకోవడంతో గడిచిపోయింది రోజు. ఇక్కడ జార్జి ప్రసాదు మొత్తం తనదే అన్నట్టు చూసుకుంటున్నాడు గాబట్టి నేనలా తిరుతుతున్నాను” అని జీవన్ కి “సారీ” చెప్పి లార్జ్ పెగ్ పోసుకున్నాడు.

చలి బాగా ముదిరిపోయింది.

ఆల్మోస్ట్ ఒకళ్ళ నొకళ్ళు అంటుకుపోతూ ఒక జంట ఇటు వైపు వస్తుంది. ఈ ఆస్ట్రియన్స్ కి మరీ సిగ్గూ శరం లేదన్నాడు యోగి. తీరా చూస్తే ఆ వస్తున్న వాళ్ళు హరిప్రియ, అనిల్.

అందరికీ మందెక్కువయ్యింది.

ఆ రాత్రి భోజనం చెయ్యకుండానే రూమ్ కొచ్చాక ఫోన్ మోగింది. షహనాజ్ “ఒక టర్కీ కేసేట్ పంపిస్తున్నాను పనికొస్తే చూడండి. గుడ్ నైట్” అంది.

కాస్సేపయ్యాకా దోబీ చక్రం ఒక కేసేట్ ఇచ్చెళ్ళాడు.

చాలా సేపు విన్నాడు జీవన్. అన్నీ పేథటిక్ నెంబర్లు.

అక్టోబర్ – 6

మర్నాడు ప్రొద్దుట యోగి టెలిఫోను కార్డు కొనుక్కుని బేంక్ కెళ్ళి యూరోలు డ్రా చేసుకొస్తానని వెళ్ళాడు. షహనాజ్ కి ఫోన్ చేసి అదే చెప్పబోతుండగా ఒక విచిత్రమైన డ్రస్సులో దర్శనం ఇచ్చేడు గంగరాజు.

“ఇదేంటి...?” అన్నాడు జీవన్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti