అంజలీ దేవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అంజలీ దేవి.
అంజలీ దేవి.
దక్షణాది సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము. 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది.
అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరిజిల్లా, పెద్దాపురంలో జన్మించింది . ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.
1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.
అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమానునిర్మించింది.ఆతరువాత భక్తతుకారాం (1973), చండీప్రియ
(1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.
ఆమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.
కొన్ని ముఖ్యమైన చిత్రాలుసవరించు
1936
రాజా హరిశ్చంద్ర
తెలుగు అంజలీదేవి నటించిన మొదటి సినిమా
1949
కీలుగుర్రం
తెలుగు అక్కినేని మొదటి సినిమా.
1950
శ్రీ లక్ష్మమ్మ కథ
తెలుగు
1950
పల్లెటూరి పిల్ల
తెలుగు అక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా
1953
పక్కయింటి అమ్మాయి
తెలుగు రేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం.
1954
పెన్ తమిళం
1955
అనార్కలి
తెలుగు
1957
సువర్ణ సుందరి
తెలుగు
1958
చెంచులక్ష్మి
తెలుగు
1959
జయభేరి
తెలుగు మంచి సంగీతభరిత చిత్రం.
1962
భీష్మ
తెలుగు ఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ.
1963
లవకుశ
తెలుగు ఘనవిజయం సాధించిన చిత్రం.
1967
భక్త ప్రహ్లాద
తెలుగు రోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం
1972
బడిపంతులు
తెలుగు ఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం
1973
తాతా మనవడు
తెలుగు దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం.
1975
సోగ్గాడు
తెలుగు
1976
మహాకవి క్షేత్రయ్య
తెలుగు
1978
అన్నాదమ్ముల సవాల్
తెలుగు కృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా.
1980
చండీప్రియ
తెలుగు శోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం.
1985
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం
తెలుగు విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర.
1992
బృందావనం
తెలుగు మంచి కుటుంబ కథాచిత్రం
ఫిలింఫేర్ అవార్డ్ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
రఘుపతి వెంకయ్య పురస్కారం - 2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత గురించి.
రామినేని పురస్కారం - 2006.
ANR జాతీయ పురస్కారం - 2008.
మరణంసవరించు
అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు.