కాశీ ప్రయాణ కథలు - అపాత్ర దానం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - Apatradanam

కాశీ ప్రయాణ కథలు - అపాత్ర దానం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

సోదరులారా ఈరోజు మీకు అపాత్రదానం అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు...

అవంతి రాజ్యాన్నిగుణశేఖరుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు తన మంత్రి సుబుధ్ధితో కలసి సదానందుని ఆశ్రమానికివెళ్ళాడు అక్కడ సదానందుడు విద్యార్ధులకు బోధిస్తూ ఉండటంతో పాఠశాల చేరువులోని అరుగు పైన కూర్చుని సదానందుని బోధనలు వినసాగాడు....

నాయన లారా సృష్టికి మూలం అయీన స్త్రీకి అనేక పర్యాయ పదాలున్నాయి.

వివిధ నామములు 1.అంగన, 2.అంచయాన, 3.అంబుజలోచన, 4.అంబుజవదన, 5.అంబుజాక్షి, 6.అంబుజానన, 7. అంబురుహాక్షి, 8.అక్క, 9.అతివ, 10.అన్ను, 11.అన్నువ, 12.అన్నువు, 13.అబల, 14.అబ్జనయన, 15.అబ్జముఖి, 16.అలరుబోడి, 17.అలివేణి, 18.అవ్వ, 19.ఆటది, 20.ఆడది, 21.ఆడుగూతురు, 22.ఆడుబుట్టువు, 23.ఇంచుబోడి, 24.ఇంతి, 25.ఇందీవరాక్షి, 26.ఇందునిభాస్య, 27.ఇందుముఖి, 28.ఇందువదన, 29.ఇగురాకుబోణి, 30.ఇగురుబో(డి)(ణి), 31.ఇభయాన, 32ఉగ్మలి,33 ఉజ్జ్వలాంగి, 34ఉవిద, 35ఎలతీగబోడి, 36ఎలనాగ, 37.ఏతుల, 38కంజముఖి, 39కంబుకం (ఠ) (ఠి), 40.కంబుగ్రీవ, 41కనకాంగి, 42కన్నులకలికి, 43కప్పురగంధి, 44కమలాక్షి, 45కరభోరువు, 46కర్పూరగంధి, 47కలకంఠి, 48కలశస్తని, 49కలికి, 50కలువకంటి, 51కళింగ, 52కాంత, 53కించిద్విలగ్న, 54కిన్నెరకంఠి, 55కురంగనయన,56 కురంగాక్షి, 57.కువలయాక్షి, 58.కూచి, 59.కృశమధ్యమ, 60.కేశిని, 61కొమ, 62కొమరాలు, 63.కొమిరె, 64.కొమ్మ, 65కోమ, 66.కోమలాంగి, 67కోమలి,68 క్రాలుగంటి, 69గజయాన, 70గరిత, 71గర్త, 72గుబ్బలాడి, 73గుబ్బెత, 74గుమ్మ, 75గోతి, 76గోల, 77చంచరీకచికుర, 78చంచలాక్షి, 79చంద్రముఖి, 80చంద్రవదన, 81చక్కనమ్మ, 82చక్కెరబొమ్మ, 83చక్కెరముద్దుగుమ్మ, 84చాన, 85చామ, 86చారులోచన, 87చిగురుటాకుబోడి, 88చిగురుబోడి, 89చిలుకలకొలికి, 90చెలి, 91చెలియ, 92చెలువ, 93చే(డె)(డియ), 94చోఱబుడుత, 95జక్కవచంటి, 96జని, 97జలజనేత్ర,98 జోటి, 99ఝషలోచన, 100తనుమధ్య, 101తన్వంగి, 102తన్వి, 103తమ్మికంటి, 104తరళలోచన, 105తరళేక్షణ, 106తరుణి, 107తలిరుబోడి,108 తలోదరి, 109తాటంకవతి, 110తాటంకిని, 111తామరకంటి, 112తామరసనేత్ర, 113తీయబోడి, 114తీ(గ)(వ)బోడి, 115తెఱవ, 116తెలిగంటి, 117తొ(గ)(వ)కంటి, 118తొయ్యలి,119 తోయజలోచన, 120తోయజాక్షి, 121తోయలి, 122దుండి, 123ధవళాక్షి, 124ననబోడి, 125నళినలోచన, 126నళినాక్షి, 127నవ(ల)(లా), 128నాంచారు, 129నాచారు, 130నాచి, 131నాతి, 132నాతుక, 133నారి, 134నితంబవతి, 135నితంబిని, 136నీరజాక్షి, 137నీలవేణి, 138నెచ్చెలి, 139నెలత, 140నెలతుక, 141పంకజాక్షి, 142పడతి, 143పడతుక, 144పద్మముఖి, 145పద్మాక్షి, 146పర్వేందుముఖి, 147పద్మాక్షి, 148పర్వేందుముఖి, 149పల్లవాధర, 150పల్లవోష్ఠి, 151పాటలగంధి, 152పుచ్చడీక, 153పుత్తడిబొమ్మ, 154పు(వు)(వ్వు)బోడి, 155పువ్వారుబోడి, 156పుష్కలాక్షి, 157పూబోడి, 158పైదలి, 159పొ(ల్తి)(లతి), 160పొ(ల్తు)(లతు)క,161ప్రతీపదర్శిని,162 ప్రమద,163 ప్రియ,164 ప్రోడ,165 ప్రోయాలు,166 బంగారుబోడి,167 బాగరి,168 బాగులాడి,169 బింబాధర, 170 బింబోష్ఠి,171 బోటి, 172 భగిని,173 భామ,174 భామిని,175 భావిని,176 భీరువు, 177 మండయంతి,178 మగువ,179 మచ్చెకంటి,180 మడతి,181 మడతుక, 182 మత్తకాశిని,183 మదిరనయన,184 మదిరాక్షి,185 మసలాడి,186 మహిళ, 187 మానవతి,188 మానిని,189 మించుగంటి,190 మించుబోడి,191 మీననేత్రి, 192 మీనాక్షి,193 ముగుద,194 ముదిత,195ముదిర,196ముద్దరాలు,197 ముద్దియ, 198 ముద్దుగుమ్మ,198 ముద్దులగుమ్మ,200 ముద్దులాడి,201 ముష్టిమధ్య,202 203 మృగలోచన,204 మృగాక్షి,205మృగీవిలోకన,206 మెచ్చులాడి,207 208 మెఱుగారుబోడి,209మెఱుగుబో(డి)(ణి),210 మెలుత,211 మె(ల్త)(లత),212 మె(ల్తు)(లతు)క,213 యోష,214 యోషిత,215 యోషిత్తు,216 రమణి 217, రామ, 218 రుచిరాంగి,219 రూపరి,220 రూపసి,221రోచన,222 లతకూన,223 లతాంగి, 224 లతాతన్వి,225 లలన,226 లలిత,227 లలితాంగి,228 లీలావతి,229 లేడికంటి, 230 లేమ,231 లోలనయన,232 లోలాక్షి,233 వధువు,234వధూటి 235వనజదళాయతాక్షి,236 వనజనేత్ర,237 వనజాక్షి,238 వనిత,239 వరవర్ణిని, 240వరానన,241వరారోహ,242 వలజ,242వశ,244 వామ,245 వామనయన, 246వామలోచన,247 వారిజలోచన,248 వారిరుహనేత్ర,249 వారిరుహలోచన, 250 వారిరుహానన,251 వాల్గంటి,252 వాలుగకంటి,253 వాశిత,254 వాసుర, 255విరితీవబోడి,256విరిబోడి,257విశాలాక్షి,258 వెలది,259శంపాంగి,260 శఫరాక్షి, 261శర్వరి,262 శాతోదరి,263 శిఖరిణి,264 శుకవాణి,265 శుభదంతి,266 శుభాంగి, 267శోభన,268 శ్యామ,269 శ్రమణ,270 సకి,271సకియ,272 సారసాక్షి,273 సిత, 274సీమంతిని,275సుందరి,276 సుగాత్రి,277 సుజఘన,278సుదతి,279 సుదృక్కు, 280 సుధ్యుపాస్య,281 సునయన,282 సుప్రియ,283సుభాషిణి,284 సుభ్రువు, 285 సుమతి,286సుమధ్య,287 సుముఖ,288 సురదన,289 సులోచన,290సువదన, 291 హంసయాన,292హరిణలోచన,293హేమ294 హరేణువు...

కుటీరం వెలుపల గుర్రం సకిలింపు వినిపించడంతో అక్కడకు వచ్చాడు సదానందుడు. తన గురుదేవుడను చూస్తూనే అభివందనం చేసాడు రాజు.

" చిరంజీవ సుఖీభవ ఏమిటిమహరాజా ఇలా వచ్చారు "అన్నాడు సదానందుడు.

" గురు దేవా నేను రుణభారంతో పూర్తిగా మునిగిపోయాను అందుకే శుభిక్షమైన ఉత్కళపై యుధ్ధంచేసి అక్కడినుండి తెచ్చిన ధనరాసులతో రుణవిముక్తుడను అవుతాను "అన్నాడు రాజు.

" మహరాజా చతుర్విధ దానాలు అంటే మరణ భయంతోఉన్నవానికి అభయంయివ్వడం,వ్వాధిగ్రస్తునకు సరియైన చికిత్స చేయించడం, విద్యాదానం,అన్నదానం.ప్రత్యుపకారం ఆశించకుండా చేసేదానాన్నిసాత్విక దానంఅని,తిరిగిఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానంఅని, తృణీకారభావంతొ చేసేదానాన్ని తామస దానం అని అంటారు. దానంచేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకుఉన్నదంతా దానంయిచ్చేవాడు దాత.తనవద్దఉన్నదంతాయిచ్చియింకా యివ్వలేక పోయానే అనిబాధపడేవారిని ఉదారుడు తనవద్ద లేకున్నాయితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని వదాన్యుడు అంటారు.శిబిచక్రవర్తి.బలిచక్రవర్తి.కర్ణుడు వంటి మహనీయులు మనచరిత్రలో దానమహిమతెలియజేసారు.

ప్రభూ శ్రద్దయాదేయం దానం శ్రద్దతొయివ్వాలి.హ్రియాదేయం గర్వంతోకాక అణుకువతొ దానంయివ్వాలి.శ్రీయాదేయం ఈదానం వలన నేనేమి కోల్పోను అనుకొవాలి.అశ్రద్దయా దేయం అశ్రద్దతతో దానంచేయరాదు అని పెద్దలు చెపుతారు.మనకు ఉన్నంతలో దానంచేయాలి. ప్రజలను తమరు పరిపాలన చేస్తున్నారుకనుక తమరు ,తమ కుటుంబం ప్రజాధనాన్ని వాడుకోవచ్చు కానీ ప్రజలవద్ద పన్నులరూపంలో వసూలు చేసిన ధనం తిరిగి వారికే దానం చేయడం ధర్మంకాదు.మీపాలనమెచ్చాలనో ,తమరిని గొప్పవారిగా మీప్రజలు చెప్పుకోవాలని అపాత్రాదానంచేస్తున్నారు. అన్నార్తులను,నిరాదరులను,విద్య,వైద్యరంగాలను అదుకోవలసిందే కాని తమరు అనాలోచితంగా అందరికి ప్రతిమాసం ధనం ఇవ్వడం న్యాయంకాదు.ఈరోజు తమరు ఇతర రాజ్యాలలో తెచ్చినరుణం ఎలాతీర్చాలి ఇలా రుణభారం పెరుగుతూ పోతే రేపు పాలనకు వచ్చేవారు ఎలాపరిపాలన చేస్తారు వచ్చిన ఆదాయం వడ్డిలుకట్టడానికి సరిపోతే పరిపాలనకు ధనం ఎలాసమకూర్చుకుంటారు. యుధ్ధంలో జయాపజయాలు తమకు తెలియనివికాదు అప్పు తెచ్చి దానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈదానాలవలవ రాజ్యంలో అభవృధ్ధి ఆగిపోయింది. పన్నులు కట్టనివారు మీదానాలవలన సోమరులుగా తయారయ్యరు,పన్ను చెల్లించేవారు మిమ్మలను ద్వేషిస్తున్నారు ,దీనిఅంతటికి తమ దానలవిధానమే ఆలోచించండి ఈరుణభారం నేడు మీరు తీర్చకున్నా రేపు మీపుత్రుడు పాలనలో ఎంతటి ఉపద్రవం అవుతుందో "అన్నాడు సదానందుడు .

" నిజమే గురుదేవ అపాత్రాదానంతో అప్పులపాలైనూ మనదేశాన్ని అభివృధ్ధిదిశగా నడిపిస్తాను. ఈఅపాత్రాదానాలకు నేటినుండి నిలిపివేస్తాను సెలవు "అని రాజధానికి బయలుదేరాడురాజు " అన్నాడు శ్రీహరి.

కథ ముగియడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.