కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి .
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
సోదరులారా ఈరోజు మీకు వికటకవి తెలివి అనే కథ చెపుతాను వినండి అని బ్రహ్మయ్య కథ చెప్పడం ప్రారంభించాడు ...
విజయనగరాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు రాజ సభలో కొలువు తీరిఉండగా ,ఆసభలోకి ప్రవేసించిన కవి " ప్రభు వులకు జయమగుగాక
నాపేరు నరసయ్య నేను కవిని నాకు మూడు సందేహలు ఉన్నాయి వాటిని తమ కొలువులో తీర్చగలిగే వారు ఉన్నారా? " అన్నాడు .
"ఏమిటా సందేహలు " అన్నారు రాయలవారు.
"ప్రభు మొదటి ప్రశ్నసముద్రం లోని అలలు ఎన్ని?
రెండో ప్రశ్న ఆకాశంలో నక్షత్రాలు ఎన్నీ ?
మూడవ ప్రశ్న మనం నివసించే భూమికి మధ్యభాగం ఎక్కడ? " అన్నాడు నారసయ్య కవి.
అతని వింత ప్రశ్నలకు రాజ సభలోని వారంతా విస్తు పోయారు.
"ప్రభు నరసయ్యగారి మూడుప్రశ్నలకు నేను రేపు సమాధానం చెపుతాను ఈరోజుకి వారు విశ్రాంతి తీసుకోమందాం " అన్నడు వికటకవి.
మరు దినం రాజసభలో ,ఒక గాడిదపై రెండు మూటలతో సభలో ప్రవేసించాడు వికటకవి .
వికటకవిని చుసిన రాయలవారు చిరునవ్వునవ్వుకున్నారు.
గాడిదపై రెండు మూటలతో వచ్చిన వికటకవిని చూసిన సభికులు అయోమయంలో పడ్డారు.
రాయలవారికి నమస్కరిస్తూ ' కవి నరసయ్యగారు మీరు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం తీసుకువచ్చాను సమధానాలు తెలుసుకునే ముందు తమరికి నాదో చిన్న ప్రశ్న కోడిముందా గుడ్డుముందా ?' నిన్న మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెచ్చాను, మొదటిప్రశ్నసముద్రంలో అలలు ఎన్ని ,ఇదిగో ఈగాడిద శరీరంపైన ఎన్ని రోమాలు ఉన్నవొ అన్ని.
మరి రొండో ప్రశ్న ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని?,గాడిదపైనున్న రెండు ఇసుక మూటలు నేలపై గుమ్మరించి ఇసుక రేణువులు లెక్కించుకొండి సరిగ్గా సరిపోతాయి.
మూడవ ప్రశ్న మనం నివసించే భూమికి మధ్యభాగం తమ కాళ్ళకిందే ఉంది కావాలంటే భూమిని కొలచి చూసుకొండి ' అన్నాడు.
సభికులంతా ఫక్కున నవ్వి కరతాళధ్వనులు చేసారు.
అవమానభారంతో తలవంచుకున్నాడు కవి నరసయ్య .
'ప్రభు తమదర్మనానికి వచ్చిన నరసయ్య కవికి సంభావన ఇచ్చి పంపవలసినదిగా నావిన్నపం ' అన్నాడు వికటకవి .
సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.
కథవిని సంతోషించినవారంతా నిద్రకు ఉపక్రమించారు.

