24-03-2017 నుండి30-03-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : వారం మొత్తం మీద ఇష్టమైన పనుల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త అటుఇటుగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులనుండి సంతృప్తికరమైన ఫలితాలు వచ్చుటకు ఆస్కారం కలదు. మాటపట్టింపులకు పోకండి అనవసరమైన వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. బంధువులతో కలిసి చేపట్టిన పనులలో ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే విషయంలో విఫలం చెందుతారు. కుటుంభంలో చిన్న చిన్న మార్పులను కోరుకొనే అవకాశం ఉంది ఆదిశగా అడుగులు ముందుకువేస్తారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.

 

 వృషభ రాశి : వారం మొత్తం మీద ఆరంభం బాగుంటుంది పనుల విషయంలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరలో ఉండకపోవచ్చును. వ్యాపారంలో ఆశించిన మేర లాబాలు రాకపోవచును నిదానం అవసరం. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే అందరిని సంప్రదించట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. కుటుంబంలో సభ్యుల ద్వార నూతన విషయాల గురుంచి తెలుసుకొనే ఆస్కారం కలదు. మానసికంగా అనుకోని సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని సంగటనలు జరుగుటకు ఆస్కారం కలదు మీరు ఆశించిన మేర అధికారుల నుండి సహాకారం లభించకపోవచ్చును. కొన్ని కొన్ని విషయాల్లో వాయిదా అనే నిర్ణయం మంచిది.



మిథున రాశి :వారం మొత్తం మీద ఉద్యోగప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కలదు కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు అలాగే ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి కావున ఈవిషయంలో నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. వ్యతిరేకవర్గం నుండి వచ్చిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతనప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరవర్గం నుండి చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు వాటిమూలన నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.


కర్కాటక రాశి : వారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినను రాను రాను వాటిలో అనుకున్న ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు కాకపోతే అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తడిని కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు పెట్టుబడుల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాల మూలాన ఊహించని ఖర్చులకు అవకాశం ఇస్తుంది ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి.  



 సింహ రాశి : వారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మీయొక్క ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారులనుండి వచ్చు ఆలోచనల విషయంలో సందిగ్దత వీడుతుంది. చేసేప్రతిపని విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీయొక్క నిర్ణయాలు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది సర్దుబాటువిధానం మేలుచేస్తుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి,పెద్దల నుండి వచ్చు సూచనల విషయంలో సరైన దృక్పథం కలిగి ఉండుట మంచిది. కుటుంభసభ్యులతో అధికసమయాన్ని గడుపుతారు.

 

కన్యా రాశి : వారం మొత్తం మీద మిత్రులద్వారా మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట మంచిది. నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిదిఆరోగ్యపరమైన విషయాల్లో బాగనే ఉంటుంది. నూతన వ్యాపారపెట్టుబడులకు సమయం అనుకూలిస్తుంది. మిత్రుల నుండి అందవలసిన సహాయం సమయానికి అందుట అనేది ఊరటచెందు విషయం. దూరప్రదేశం నుండి విలువైన విషయలు తెల్సుకొనే ఆస్కారం కలదు.

 



తులా రాశి : వారం మొత్తం మీద బంధుమిత్రులతో సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో ఆసక్తిని చూపిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట వలన నలుగురిలో ఆశించిన విధంగా పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. సోదరులకు అనుగుణంగా వ్యవహరించుట సూచన. స్వల్పదూర ప్రయాణాలకు సమయం ఇస్తారు ప్రయాణాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు వారినుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. పెద్దలనుండి ఆశించిన సహాకారం పొందుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది గుర్తింపు లభిస్తుంది.

 

 



వృశ్చిక రాశి : వారం మొత్తం మీద ఆశించిన ఫలితాలు కొంత నిదానంగా వచ్చుటకు అవకాశం కలదు. ఆప్తులను కలుస్తారు వారితో చేయు చర్చలు పురోగతిని కలిగి ఉంటవి. చేపట్టిన పనులను కొంత ఇబ్బందికి లొనయినను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారి సహకారం ఆశించిన మేర లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు తోటివారిని నప్పించేఅవకాశం ఉంది కావున బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి గతకొంతకాలంగా ఆగిఉన్న పనులు పోర్తిఅవుతాయి.


ధనస్సు రాశి : వారం మొత్తం మీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట వలన మంచి పేరునుసంపాదించుకొనే అవకాశం కలదు ఆరంభం బాగుంటుంది. మిత్రులతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వారిసహకరం పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. తీసుకొనే నిర్ణయాలు కీలకమైన మార్పులకు అవకాశం ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసిన చర్చలు ఒక కొలికి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది,తగిన జాగ్రత్తలు అలాగే ముందుచూపు ఉండుట అనేది సూచన. ఉద్యోగంలో కొంత ఒత్తిడిని కలిగి ఉండే అవకాశం కలదు.స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి సమయానికి భోజనం చేయండి విశ్రాంతి అవసరం.

 

మకర రాశి : వారం మొత్తం మీద పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు కాకపోతే పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతస్థాయి నుండి ప్రశంశలు లభించే అవకాశం కలదు అదేవిధంగా అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. కుటుంభంలో మీయొక్క ఆలోచనలను స్వాగతించే అవకాశం ఉంది అందరి సహకరం లభించుట వలన మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 


కుంభ రాశి : వారం మొత్తం మీద బందువులతో సమయాన్ని సరదగా సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. విందులు,వినోదాల్లో మిత్రులతో కలిసి పాలుపంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి,సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, ఊహించని విధంగా కొన్న్ని విషయల్లో చివరినిమిషంలో ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది తోటివారి నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి దూరబంధువుల నుండి నూతన విషయలు తెలుసుకొనే అవకాశం కలదు. చర్చాసంభందమైన విషయల్లో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి.      

 


మీన రాశి : వారం మొత్తం మీద ఉత్సాహంను కలిగి ఉండి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. నలుగురిలో చేపట్టిన పనుల వలన మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. అధికారులతో వారంచివరలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. చిననాటిమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది విందుల్లో పాల్గొంటారు. విదేశీప్రయత్నాల విషయంలో కలిసి వస్తాయి వాటికోసం చేయుప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం కలదు. సరైన ప్రణాళిక లేకపోతే అనవసరమైన ఒత్తిడికి లోనయ్యేఅవకాశం ఉంది జాగ్రత్త. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు.

..

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Athi Sukumari
కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.