29-09-2017 నుండి 05-10-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు స్పష్టమైన అవగాహన  కలిగి ఉండుట అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. మీ అభిప్రాయాలను ఇతరులకు తెలియజేసే ముందు వారి  సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. జీవితభాగస్వామితో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద సోదరులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో  అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. సంతానం విషయంలో మాత్రం ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మీరు సంతానం కోసం ఖర్చులు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల సూచనలు పాటించుట మంచిది. కుటుంబంలో సభ్యులతో చర్చలు చేయకపోవడం సూచన. ఉద్యోగంలో అధికారులతో మాటపట్టింపులకు పోకండి. పనుల్లో శ్రమ, భారం తప్పక పోవచ్చును. సర్దుబాటు మంచిది.


కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద మీ నూతన ఆలోచనలను తల్లితో పంచుకొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన లబ్దిని పొందుతారు. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండుట ఉత్తమం. విదేశాల్లో ఉండే మిత్రులనుండి సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలకు అవకాశం ఉంది. ఒకింత ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది , తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది.

 



 సింహ రాశి : ఈ వారం మొత్తం మీద ముఖ్యమైన పనులకు సమయం ఇవ్వడం మంచిది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మీరు కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బంధువులతో తలపెట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం ఉండటం మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. జీవిత భాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం రాకపోవచ్చును.

 

 


కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు  నూతన ప్రయత్నాలు చేసే ముందు కాస్త ప్రణాళిక కలిగి ఉండుట సూచన. బంధువులతో కలిసి స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికలావాదేవీల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. అప్పులు ఇవ్వకపోవడం సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం , లేకపోతే ఇబ్బందులు తప్పవు. దైవపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. సమయానికి భోజనం చేయుట మేలు.

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విశయాలకే హైరానా పడుతారు. మీరు నూతన మిత్రులతో సమయాన్ని సరదగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారుల నుండి రావాల్సిన సహాయం అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపార పరమైన విషయంలో బాగానే ఉంటుంది. జీవితభాగస్వామితో ఉన్న వివాదం మరింతగా పెరుగుటకు అవకాశం ఉంది. మీ తప్పులను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచన చేయుట మంచిది. గతంలో చేసిన పనులకు పెద్దలకు సమాధానంచెప్పవల్సి వస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ ముందుచూపు మిమ్మల్న కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆత్మేయుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చిననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వివాదాస్పద నిర్ణయాలకు,ఆలోచనలకు దూరంగా ఉండుట మంచిది.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఆశించిన మేర సహకారం ఇతరులనుండి పొందుతారు. మీరు మానసికంగా దృడంగా ఉండుట సూచన, చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందకండి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రణాళిక కలిగి ఉండుట సూచన. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అనుకోకుండా చేసే ప్రయాణాలు మీకు లబ్దిని కలిగిస్తాయి. అధికభాగం సమయం మీరు దైవసంబంధ కార్యక్రమాలకు వెచ్చిస్తారు. మిత్రులను కలుస్తారు.



మకర రాశి : ఈవారం మొత్తం మీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ఉన్నత విద్య అవకాశాలు పొందుతారు. గతంలో చేసిన పనులకు గాను నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీరు మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం, సూచనలు లభిస్తాయి. ఆర్థికంగా సర్దుబాటు అవసరం. దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఊహించిన ఖర్చులకు అవకాశం కలదు.

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటార. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది, తోటివారి సహకారం తీసుకోవడం మంచిది. మీరు మానసికంగా కొంత ఒత్తిడిని మిత్రుల నుండి పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన సమాచరం తెలుసుకొనే అవకాశం ఉంది , మార్పులను స్వాగతించుట అవసరం. బంధువులతో కలిసి చేసే ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. మౌనం మిమ్మల్ని కాపాడుతుంది.

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద జీవిత భాగస్వమిటో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ముందుగా చిన్న చిన్న పనులను పూర్తిచేయుట ఉత్తమం. ప్రయాణాల్లో ఆటంకాలు. మీరు నలుగురితో కలిసి మీ ఆలోచనలకు కార్యరూపం తీసుకువస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చర్చాపరమైన సమయాల్లో మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం.

 

అవసరం

 

     

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు