అందానికి అందం, పర్సనాలిటీకి పర్సనాలిటీ ఉన్నా అదృష్టమొక్కటీ కలిసిరాకపోవడంతో గ్లామర్, పెర్ఫామెన్స్ అన్నీ వృధా అయిపోతున్నాయి. ‘1 నేనొక్కడినే’ సినిమాతో తొలి సినిమాలోనే మహేష్ లాంటి స్టార్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే అవకాశం రావడం అదృష్టమే. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి సోనన్ గ్లామర్ అడవి కాచిన వెన్నెలే అయ్యింది.రెండో సినిమాగా నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమాలో నటిస్తోంది కృతి సోనన్. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ అందాల భామ, తెలుగు సినీ రంగంలో ప్రతి ఒక్కరూ వృత్తి పట్ల ప్రదర్శిస్తున్న అంకిత భావం తననెంతో ఆకట్టుకుందని చెబుతుంది. గ్లామరస్ తారగా, చక్కని నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడిరచింది కృతి సోనన్.సుధీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ‘దోచెయ్’ సినిమాకి ప్రీ రిలీజ్ మంచి టాక్ నడుస్తోంది తెలుగు సినీ రంగంలో. బయ్యర్స్‌లోనూ సినిమా పట్ల చాలా క్రేజ్ ఉంది. ఆడియన్స్ కూడా ‘దోచెయ్’ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఉన్నారు. అన్నీ పాజిటివ్ సైన్స్ కావడంతో నాగచైతన్యకీ, కృతి సోనన్‌కీ ‘దోచెయ్’ బ్రేక్ ఇవ్వనుండడం ఖాయమే కావొచ్చు.
|