Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

నా కథను బట్టే నా సినిమాలో స్టార్లు- ర‌విబాబు


ర‌విబాబు సినిమాల‌దో డిఫ‌రెంట్ స్కూలు. అల్ల‌రి నుంచి అవును వ‌ర‌కూ ఏ సినిమా అయినా తీసుకోండి. ర‌విబాబు సినిమాల `క‌ల‌రింగు` వేరుగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాల ప‌నిత‌నాన్ని అర్థం చేసుకొని.. అక్క‌డి టెక్నాల‌జీని అవ‌పోసాన ప‌ట్టి... త‌క్కువ బ‌డ్జెట్ లో క్వాలిటీ మేకింగ్‌తో ఓ సినిమా తీయ‌గ‌ల నేర్ప‌రి. అత‌ని పోస్ట‌ర్లు కూడా డిఫ‌రెంటుగా ఉంటాయి. ఒకే ఒక్క పోస్ట‌రుతో సినిమా ప్ర‌చారం చేసేయ్య‌గ‌ల స‌మ‌ర్థుడు. అల్ల‌రి, న‌చ్చావులే, నువ్విలా, అన‌సూయ లాంటి హిట్ సినిమాలు ర‌విబాబు ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు అవును 2 అంటూ మ‌రోసారి భ‌య‌పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఈ సంద‌ర్భంగా ర‌విబాబుతో చిట్ చాట్ ఇది.

* బేసిగ్గా కామెడీ ఎక్కువ చేస్తుంటారు.. కానీ హార‌ర్ సినిమాలు తీస్తున్నారు. ఏంటి క‌థ‌..?
- కామెడీ అంటే నాక్కూడా ఇష్ట‌మే. అయితే కామెడీ సినిమాలు తీయ‌డం అనుకొన్నంత తేలికైన విష‌యం కాదు. అంద‌ర్నీ ఒకేలా న‌వ్వించ‌లేం. ఒక జోక్ ఒక‌డ్ని న‌వ్విస్తుంది.. అదే జోక్ ఇంకొక‌డికి చిరాకు తెప్పిస్తుంది. యూనివ‌ర్స‌ల్ కామెడీ చేయ‌డం క‌ష్టం.

* అల్ల‌రి తీశారుగా.. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నం చేయొచ్చు క‌దా.. 
- ఈసారి స్ర్కిప్టు రాసుకొన్న‌ప్పుడు  నాకే న‌వ్వొచ్చింద‌నుకోండి.. అప్పుడు అల్ల‌రి లాంటి సినిమా త‌ప్ప‌కుండా తీస్తా.

* ల‌డ్డూ బాబు ఎందుకు డిజ‌ప్పాయింట్ చేసింది..?
- న‌రేష్ అంటే కామెడీ అనుకొంటారంతా. కానీ అస్త‌మానూ అవే సినిమాలా అనిపించింది. ఓ ఫీల్ గుడ్ క‌థ చెబుదామ‌నుకొన్నా. అక్క‌డే రిజ‌ల్ట్ తేడా కొట్టేసింది. ఆడియ‌న్స్ ఏదో ఆశించి వ‌చ్చారు... మేం ఇంకోటేదో ఇచ్చాం.

* అవును 2 తీద్దామ‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చింది?
-  అవును తీస్తున్న‌ప్పుడే పార్ట్ 2 కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడూ మంచికీ చెడుకీ జ‌రిగే సంగ్రామ‌మే. కెప్టెన్ రాజు అనేవాడి అరాచ‌కం.. `అవును`లో చూపించాం. చివ‌రికి బ్యాడ్ మీద గుడ్ నెగ్గింది. మ‌ళ్లీ ఆ కెప్టెన్ రాజు వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న‌దే `అవును 2` సినిమా.

* ఇలాగైతే ఒక సినిమాకి  ఎన్ని సీక్వెల్స్ అయినా చేయొచ్చు క‌దా.?
- చేయొచ్చు. కానీ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్ష‌న్ సినిమాల‌కు ఈ అవ‌కాశం చాలా త‌క్కువ‌. హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల‌కే ఛాన్స్ ఉంటుంది.

* టికెట్ కొన్న ప్రేక్ష‌కుడికి స‌గం క‌థ చెప్పి పంపించేయ‌డం అన్యాయం క‌దా..?
- క‌థ ఎంత చెప్పాం, ఏం చెప్పాం?  అన్న‌ది కాదు.. థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుడికి ఎంత అర్థ‌మ‌య్యేలా చెప్పాం. ఎంత ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పాం? అనేదే ముఖ్యం.

* అవును.. యామీ గౌత‌మ్ అనుభ‌వాల‌తో తీసిన సినిమా అన్నారు. మ‌రి.. 2 సంగ‌తేంటి?
- అవునులోని భ‌యాన్ని కొన‌సాగించాం అంతే. స్ఫూర్తి అంటూ ప్ర‌త్యేకంగా ఏం లేదు.

* పూర్ణ‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ల‌నే తీసుకొన్నారు...
- అవునులో దాదాపుగా అన్ని పాత్ర‌ల్నీ ఈ సినిమాలో కంటిన్యూ చేశాం. కొన్ని కొత్త పాత్ర‌లు యాడ్ అవుతాయి.

* ఇక దెయ్యాల సినిమాలే తీస్తారా?
- లేదు... నా త‌ర‌వాతి సినిమా యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉంటుంది.

* పెద్ద స్టార్ల‌తో చేయ‌రెందుకు?
- చేయ‌కూడ‌ద‌ని ఏం లేదు.. అలాగ‌ని చేయాల‌నీ అనిపించ‌డం లేదు. దాదాపుగా హీరోలంతా నాకు తెలుసు. వాళ్ల‌తో మంచి చ‌నువు ఉంది. నాకు క‌థ చెప్ప‌వా?  అని అడుగుతుంటారు. కానీ.. నేను హీరో కోసం క‌థ‌లు త‌యారు చేసుకోను. క‌థ ఎవ‌రిని డిమాండ్ చేస్తే వారితోనే తీస్తా.

* న‌టుడిగా దూర‌మ‌య్యారెందుకు?
- నేనేం దూరం అవ్వ‌లేదు. ద‌ర్శ‌కులే న‌న్ను దూరం పెట్టారు. పెద్ద‌వాళ్లంతా `వాడు ద‌ర్శ‌కుడు అయిపోయాడు క‌దా.. ఇక న‌టించ‌డేమో.` అనుకొంటున్నారేమో..?  కొత్త ద‌ర్శ‌కులు మాత్రం నా కోసం కొన్ని పాత్ర‌లు సృష్టిస్తున్నారు. మీరు మా సినిమాలో ఉండాలి సార్‌..  అని అడిగితే న‌టిస్తున్నా.

*  మ‌రి అవును 3 ఎప్పుడు?
- అవును హిట్ట‌యింద‌ని 2 తీశాం.. చూద్దాం 2 రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో??

* ఓకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌..

- కాత్యాయని
 

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 10 - Le Le Lele Ivvale Lele - Gudumba Shankar