Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Father direction in son movie

ఈ సంచికలో >> సినిమా >>

అందం, అభినయంతోనే అవకాశాలు

Performance Opportunities

‘సీమటపాకాయ్‌’, ‘అవును’ చిత్రాల హీరోయిన్‌ పూర్ణ ‘అవును`2’ సినిమాతో కూడా ఆకట్టుకుంది. అందం, అభినయం, నృత్యం ఈ మూడింట్లోనూ ప్రావీణ్యం పూర్ణ సొంతం. అదృష్టం కలిసొస్తే ఓ మోస్తరు హీరోయిన్‌గా, కాలం ఇంకా కలిసొస్తే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే లక్షణాలున్న పూర్ణ, మహేష్‌బాబు హీరోగా రానున్న ‘శ్రీమంతుడు’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తుంది.

‘శ్రీమంతుడు’ కాకుండా, పూర్ణ నటిస్తున్న సినిమా ‘రాజుగారి గది’. బుల్లితెర యాంకర్‌ ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. థ్రిల్లర్‌ జోనర్‌ సినిమా ‘రాజుగారి గది’ అట. పూర్ణని చూస్తే దెయ్యాల సినిమాలే గుర్తుకొస్తాయేమో అనిపిస్తుంది. కానీ ఏ ప్రాత్రలో అయినా ఒదిగిపోవడయే పూర్ణతో, థ్రిల్లర్‌ సినిమాలు చేయడం దర్శకులకు తేలిక. అందం, అభినయంతో అవకాశాలు దక్కించుకుంటున్న పూర్ణ తెలుగులో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తోంది.

ఒక్క ఐటమ్‌ సాంగ్‌తో హంసానందిని కెరీర్‌ టర్న్‌ అయినట్టుగా, పూర్ణ కెరీర్‌ ‘శ్రీమంతుడు’తో టర్న్‌ అవుతుందో లేదంటే ‘రాజుగారి గది’ సినిమాతో ఆమె దశ తిరుగుతుందో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam