Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

పెద్ద హీరోలను వాడుకుంటున్న చిన్న సినిమాలు

కథా బలం ఉన్నప్పటికీ హీరో, హీరోయిన్ల ఫేస్‌ వాల్యూస్‌ లేకపోతే ఆ సినిమాలు అంతగా ఆదరణ పొందడం లేదు. అందుకే ఈ మధ్య తెలివిగా చిన్న సినిమా డైరెక్టర్లు పెద్ద హీరోలను బాగా వాడేసుకుంటున్నారు. వారి సినిమాల్లోని పాటల పేర్లు టైటిల్స్‌గా, వారి డైలాగులు పేరడీ చేసి కామెడీ బిట్స్‌గా ఇలా చాలా రకాలుగా వారిని యూజ్‌ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. తద్వారా ఎంతో కొంత లాభపడుతున్నారు కూడా. మొన్నామధ్య వచ్చిన 'సుడిగాడు' సినిమా అంతా సీనియర్‌ హీరోల స్పూఫ్‌లే ఉంటాయి. అలాగే ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలన్నింటికీ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌. ఏదో ఒక రకంగా ఆయనను యూజ్‌ చేసుకోకుండా సినిమా ఉండట్లేదు. ఈ మధ్య వచ్చిన 'బాహుబలి' ఘన విజయంతో ఆ సినిమా కూడా చిన్న సినిమాలకు ఆదర్శం అయిపోయింది.

అలాగే 'శ్రీమంతుడు', మహేష్‌ని, బాలయ్య బాబుని కూడా యూజ్‌ చేసుకుంటున్నారు. ఇదీ ఒక రకంగా మంచిదే.. ఈ రకంగా పెద్ద హీరోలు చిన్న హీరోలకు మేమున్నాం.. మీరు సినిమాలు చేసుకోండి.. మీ విజయానికి మేం భరోసా ఇస్తాం అన్నట్లుగా కనిపిస్తోంది. పెద్ద హీరోలు చిన్న సినిమాలకు ప్రమోషన్‌ కోసం కూడా సహకరిస్తున్నారు. పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు పెరగదేమో కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు ఈ రకంగా వెన్ను దన్నుగా మారాయి. 

మరిన్ని సినిమా కబుర్లు