Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఆ సినిమాలో ఒక్క ఫ్రేములోనూ నేను క‌నిపించ‌ను  - ర‌వితేజ‌

చంటిగాడు...లోక‌ల్‌..
సిటీకి ఎంతోమంది క‌మీష‌న‌ర్లు వ‌స్తుంటారు పోతుంటారు.. చంటిగాడు ఇక్క‌డే ఉంటాడు!
క‌మీష‌న‌ర్ కూతుర్ల‌కు మొగుళ్లు రారా...
మాసంటే బ‌స్సుపాసు కాదురా, ఎవ‌డు ప‌డితే వాడు పెట్టేసుకోవ‌డానికి...
- డేరింగ్ & డాషింగ్ హీరోయిజానికి అద్దం ప‌ట్టిన డైలాగులివి. మ‌రెవ‌రైనా ఈ డైలాగులు ప‌లికితే ఎలా ఉండేదో గానీ.. ర‌వితేజ నోటి నుంచి వ‌చ్చేస‌రికి లెవెలైపోయింది.  సాధార‌ణంగా డైలాగులు హీరోయిజానికి ఎన‌ర్జీ ఇస్తుంటాయి. కానీ ఆ డైలాగుల‌కే ఎన‌ర్జీ ఇచ్చిన హీరోయిజం... ర‌వితేజ‌ది.ఆ ఊర‌మాస్ స్టైల్‌.. జ‌నానికి బాగా ఎక్కేసింది. అందుకే ర‌వితేజ అలా మ‌న‌సుల్లో నాటుగా నాటుకుపోయాడు. యేళ్ల‌త‌ర‌బ‌డి అల‌రిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కిక్ 2 అంటూ మ‌రోసారి వినోదాలు పంచ‌బోతున్నాడు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ‌తో చిట్ చాట్‌.

* కిక్ 2 గురించి ఒక్క‌మాట‌లో చెప్ప‌మంటే..
- కిక్‌కి మించిన కిక్‌. కిక్ సినిమా చూసి అంద‌రూ బాగా న‌వ్వుకొన్నారు. థ్రిల్ ఫీల‌య్యారు. అంత‌కు రెండింత‌ల వినోదం ఈ సినిమా ఇస్తుంది... నో డౌట్‌.

* కిక్ కి ఇది సీక్వెల్ కాదు అంటున్నారు. మ‌రి ఆ పేరు ఎందుకు పెట్టిన‌ట్టు?
- వ‌క్కంతం వంశీ ఓ లైన్ చెప్పాడు. బాగుంద‌న్నాం. దాన్ని డెవ‌లెప్ చేసుకొంటూ వెళ్తే.. ''కిక్ 2 కంటే మించిన పేరు ఈ క‌థ‌కి పెట్ట‌లేం'' అనిపించింది. అందుకే అది ఫిక్స్ చేశాం.

* కిక్‌ని దృష్టిలో పెట్టుకొని జ‌నాలు థియేట‌ర్‌కి వ‌స్తారు క‌దా..
- రానివ్వండి.. నో ప్రాబ్లం. ఈ క‌థ‌లో అంత మేట‌రుంది.

* కిక్ నుంచి కిక్ 2 వ‌ర‌కూ సురేంద‌ర్ రెడ్డి లో గ‌మ‌నించిన మార్పులేంటి?
- మ‌నిషిగా ఏం మార‌లేదు. కిక్‌కి ముందు త‌న సినిమాలు కాస్త సీరియ‌స్ వేలో సాగేవి. కిక్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోకి దిగిపోయాడు. ఆ సినిమా చూసే అంద‌రూ షాకైపోయారు. సూరి ఇలాంటి సినిమాలూ తీస్తాడా అనిపించింది. ఆ త‌ర‌వాత త‌ను ఎంట‌ర్‌టైన్ మెంట్‌ని న‌మ్ముకొంటూ ముందుకెళ్లాడు. రేసుగుర్రం చాలా బాగా తీశాడు. ఇప్పుడు కిక్ 2తో కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతాడు.

* మీ సినిమా అనేస‌రికి అంద‌రూ స్టైల్ మార్చి.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోకి దిగిపోతారెందుకు?
- ఏమో మ‌రి. న‌న్ను చూస్తే... అలాంటి క‌థ‌లు రాసుకోవాల‌నిపిస్తుందేమో. వినాయ‌క్ కృష్ణ‌తో కామెడీ చేశాడు. వినాయ‌క్ హీరోతో ఆ స్థాయిలో కామెడీ చేయించ‌డం అదే తొలిసారి. రాజ‌మౌళి కూడా అంతే క‌దా.

* రాజ‌మౌళి.. బాహుబ‌లి చూశారా, మీ స్పంద‌నేంటి?
- చూడ‌క‌పోతే ఎలా.. చాలా గొప్ప‌గా తీశాడు. మ‌న తెలుగు సినిమా అంటే ఇదీ.. అంటూ బాలీవుడ్ స్థాయిలో నిరూపించాడు. త‌న‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నా. ఈమ‌ధ్య విడుద‌లవుతున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. బాహుబలి, శ్రీ‌మంతుడు పెద్ద హిట్స్ అయ్యాయి. రేపు రాబోయే రుద్ర‌మ‌దేవి కూడా పెద్ద హిట్ కొట్టాలి. సినిమాలు ఇలా హిట్ట‌వుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది. నా సినిమానే కాదు, అంద‌రి సినిమాలూ బాగా ఆడాలి. 

* సినిమాలు రెగ్యుల‌ర్ గా చూస్తుంటారా?
- భ‌లేవారే.. చూడ‌క‌పోతే ఎలా?   కొత్త‌  సినిమా వ‌చ్చిదంటే చాలు, ఎలా ఉన్నా చూస్తా. భాష‌తోనూ ప‌నిలేదు.

* తెలుగు సినిమాల్లో ఎలాంటి మార్పు క‌నిపిస్తోంది?
- పాజిటీవ్ వైబ్రేష‌న్స్ క‌నిపిస్తున్నాయి. ఓ సినిమాని పాజిటీవ్ దృక్ప‌థంతో చూస్తే... ఫ‌లితం వేరుగా ఉంటుంది. ఆడియ‌న్స్ అందుకు అల‌వాటు ప‌డుతున్నారేమో అనిపిస్తోంది. సినిమా తీసేవాళ్ల‌లో కూడా మార్పులొస్తున్నాయి. ఈ మార్పు మంచికే. 

* మీరైతే మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే ఇరుక్కుపోయార‌నిపిస్తుంద‌టుంది..
- అదేం కాదండీ. ఆటోగ్రాఫ్‌లాంటి సినిమాలు చేశా క‌దా. కొత్త ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు రిజ‌ల్ట్ బాగుంటే.. ఆ ఉత్సాహంతో అలాంటి సినిమాలే చేస్తుంటాం. కానీ ప్ర‌తిసారీ దెబ్బ‌కొట్టేస్తే ఎలా..??

* అంటే భవిష్య‌త్తులో ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలు మీ నుంచి రావా?
- అది ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల్ని బ‌ట్టి ఉంటుంది. అలాంటి క‌థ‌లు చేస్తా. కానీ నా త‌ర‌హా వినోదం మిస్ కాకూడ‌దు.

* ఎలాంటి స‌పోర్ట్ లేకుండా స్టార్ అయ్యారు. మీ ప్ర‌యాణాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకొంటూ ఏమ‌నిపిస్తుంది?
- మంచి మంచి సినిమాలు, నా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల వ‌ల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి ఎదిగే ఏ న‌టుడ‌న్నా నాకు గౌర‌వ‌మే. 

* కాస్త హుషారుగా ఎవ‌రైనా న‌టిస్తే.. ర‌వితేజ‌ని ఇమిటేట్ చేస్తున్నాడే అనిపిస్తుంటుంది. దానికి కార‌ణం ఏమిటి?
- ఏమో నండీ. నా యాక్టింగ్ పూర్తిగా ఫ్రీ స్టైల్‌లో ఉంటుంది.  ఆ పాత్ర‌ని ఈజీ వేలో చేసుకొంటూ వెళ్లిపోతా. ఆ త‌ర‌హాలో ఎవ‌రు న‌టించినా అలా అనిపిస్తుందేమో..?

* సినిమా హిట్‌, ఫ్లాప్‌ల ప్ర‌భావం మీమీద ఎంత వ‌ర‌కూ ఉంటుంది?  వాటిని ఎలా స్వీక‌రిస్తారు?
- అబ్బే.. పెద్ద‌గా ప‌ట్టించుకోనండి. నేను ఏ విష‌యాన్నీ సీరియ‌స్‌గా తీసుకోను. సినిమాల్లో నా పాత్ర‌ల టైపే.

* స‌హాయ ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించారు. మ‌రి మెగా ఫోన్ ప‌ట్టాల‌ని లేదా?
- త‌ప్ప‌కుండా ఏదో ఓ రోజు సినిమా తీస్తానండీ. కాక‌పోతే అందులో హీరోగా నేను మాత్రం న‌టించ‌ను. నాకంటే బెట‌ర్ యాక్ట‌ర్‌ని పెట్టుకొంటా. ఒక్కఫ్రేములోనూ నేను క‌నిపించ‌ను. ఇది ఫిక్స్‌.

* మీరు హిందీ బాగా మాట్లాడ‌తారు క‌దా.. బాలీవుడ్‌లో సినిమా చేయాల‌ని అనిపించ‌లేదా?
- కొన్ని అవ‌కాశాలు వ‌చ్చాయండీ. కానీ నేనే సీరియ‌స్‌గా తీసుకోలేదు.

* యాడ్స్‌లో న‌టిస్తున్నారు. ఆ అనుభ‌వం ఎలా ఉంది?
- న‌న్నెవ‌రూ యాడ్స్‌లో న‌టిస్తావా అని అడ‌గ‌లేదు. ఇప్పుడు వీళ్లు అడిగారు. ఆ జోష్‌లో చేసేశా. నాకు సినిమాల‌కూ, యాడ్స్‌కీ పెద్ద తేడా క‌నిపించ‌లేదు.

* పూరితో సినిమా ఎప్పుడు?
- వ‌చ్చే యేడాది త‌ప్ప‌కుండా ఉంటుంది.

* బెంగాల్ టైగ‌ర్ క‌బుర్లేంటి?
- ఫ‌క్తు నాన్ వేజ్ సినిమా అది. మాస్ మ‌సాలా బాగా ద‌ట్టించాం. షూటింగ్ పూర్తికావొచ్చింది.

* ఓకే ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ కిక్‌...
- థ్యాంక్యూ... 
 
- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review