Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: సౌఖ్యం 
తారాగణం: గోపీచంద్‌, రెజినా, షావుకారు జానకి, జెపి, బ్రహ్మానందం, రఘుబాబు, ముఖేష్‌ రుషి, ప్రదీప్‌ రావత్‌, పృధ్వీ, పోసాని, కృష్ణభగవాన్‌, సత్యకృష్ణ, సప్తగిరి, శివాజీరాజా, సురేఖావాణి, కృష్ణభగవాన్‌ తదితరులు. 
చాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ళ 
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌ 
నిర్మాణం: భవ్య క్రియేషన్స్‌ 
కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన 
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌ 
దర్శకత్వం: ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి 
నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్‌ 
విడుదల తేదీ: 24 డిసెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
బాధ్యతలేమీ లేని బలాదూర్‌గా హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే కుర్రాడు శీను (గోపీచంద్‌). అతనికి శైలజ (రెజినా) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అయితే ఈలోగా రౌడీలొచ్చి ఆమెను ఎత్తుకెళ్ళిపోతారు. శైలజ కోసం వెతికే క్రమంలో బాపూజీ (ప్రదీప్‌ రావత్‌) పరిచయమవుతాడు. తన తండ్రిని కాపాడిన బాపూజీ కోసం కలకత్తా వెళ్ళి, అక్కడి డాన్‌ పిఆర్‌ (దేవన్‌) కుమార్తెను తీసుకురావాలనుకుంటాడు. ఆమె ఎవరో కాదు తన శైలజ అని తెలుస్తుంది శీనుకి. ఆ తర్వాత ఏమవుతుందన్నది మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
గోపీచంద్‌ చెయ్యగలిగిందంతా చేశాడు. డాన్సులు బాగా చేశాడు. ఫైట్స్‌ బాగా చేశాడు. లుక్‌ పరంగా బాగా కనిపించాడు. స్టైలిష్‌గా ఆకట్టుకున్నాడు. అయితే అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. రెజినా కూడా అంతే. చెయ్యగలిగిందంతా చేసింది. గ్లామరస్‌గా కనిపిస్తూనే, నటనతో ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. కానీ ఆమె నటన ఎలివేట్‌ అయ్యే సన్నివేశాల్లేవు. 
కామెడీ పరంగా కూడా స్పూఫ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నమే జరిగింది. స్టార్‌ కాస్టింగ్‌ చాలా ఉంది. సప్తగిరి, బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని కృష్ణమురళి లాంటి కమెడియన్లు తెర నిండా కనిపించారు. కానీ నవ్వించడంలో కొత్తదనాన్ని చూపలేకపోయారు. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయంతే. విలన్లు దేవన్‌, ప్రదీప్‌ రావత్‌ కూడా సోసో అంతే. 
కథ కొత్తదేమీ కాదు. అలాంటప్పుడు కథనం యాంగిల్‌లో కొత్తగా ట్రై చేసి ఉండాల్సింది. 'లౌక్యం' సినిమాతో హిట్‌ కొట్టగలిగిన రైటింగ్‌, స్క్రీన్‌ప్లే, స్టోరీ టీమ్‌ ఆ మార్క్‌ చూపించలేకపోయింది. సంగీతం కూడా సోసోగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాని చాలా రిచ్‌గా చూపించాడు సినిమాటోగ్రాఫర్‌. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ గురించి పెద్దగా చెప్పుకోడానికేమీ లేదు. 

కథ కొత్తదేమీ కాదని దర్శకుడు ముందే చెప్పేశాడు. కమర్షియల్‌ సినిమానే తీశాం అని కూడా చెప్పేశాడు. కానీ కమర్షియల్‌ సినిమా అయినా ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలనుకుంటాడు ప్రేక్షకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నా, దాన్ని సరిగ్గా ప్రెజెంట్‌ చేయలేకపోయారు. పాటలున్నాయి, ఫైట్స్‌ ఉన్నాయి, కామెడీ ఉంది. అవసరమైనవి, అవసరమైనంతగా వాడుకోలేకపోవడం పెద్ద మైనస్‌. ఫస్టాఫ్‌ సోసోగా సాగిపోతుంది. సెకెండాఫ్‌ కూడా అంతే. ట్విస్ట్‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడే అవి పండుతాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో కలిసిపోతేనే బాగుంటుంది. గోపీచంద్‌, రెజినా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సినిమాకి కాస్త ఊరట. రెజినా గ్లామర్‌, గోపీచంద్‌ మాస్‌ ఇమేజ్‌ థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించింది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
సౌఖ్యంగా లేదు 

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
movie review