Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: భలే మంచి రోజు 
తారాగణం: సుధీర్‌బాబు, వామిక, ధన్య బాలకృష్ణన్‌, సాయికుమార్‌, పోసాని కృష్ణమురళి, వేణు, శ్రీరామ్‌, ప్రవీన్‌, చైతన్య కృష్ణ, విద్యుల్లేఖ రామన్‌, పృధ్వీ తదితరులు. 
చాయాగ్రహణం: షామ్‌దత్‌ సైనుదీప్‌ 
సంగీతం: సన్నీ 
నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య 
నిర్మాతలు: విజయ్‌, శశి 
విడుదల తేదీ: 25 డిసెంబర్‌ 2015 
క్లుప్తంగా చెప్పాలంటే 
ప్రేమలో ఫెయిల్‌ అయిన రామ్‌ (సుధీర్‌బాబు), తన ప్రేమను కాదని వేరే పెళ్ళికి రెడీ అయిపోయిన మాయ (ధన్య బాలకృష్ణన్‌)ని పెళ్ళి పీటలపై నిలదీసేందుకు వెళ్తుంటాడు. దారిలో శక్తి (సాయికుమార్‌) వాహనాన్ని రామ్‌ ఢీ కొడతాడు. ఈ ఘటనలో శక్తి కిడ్నాప్‌ చేసిన సీత (వామిక) పారిపోతుంది. పెళ్ళి పీటల మీదనుంచే శక్తి గ్యాంగ్‌, సీతను ఎత్తుకొస్తుంది. సీత మిస్‌ అవడానికి రామ్‌ కారణం కావడంతో, సీతను తెచ్చిచ్చేదాకా, రామ్‌ స్నేహితుడ్ని శక్తి తన వద్ద ఉంచుకుంటాడు. అప్పుడు రామ్‌ ఏం చేశాడు? సీతను పట్టుకునే క్రమం రామ్‌ పడ్డ పాట్లు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
సినిమా సినిమాకీ సుధీర్‌బాబు నటుడిగా మెచ్యూరిటీ లెవల్స్‌ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాలో నటుడిగా ఇంకో మెట్టు పైకెక్కాడు. కామెడీ పండించాడు. యాక్షన్‌లో అదరగొట్టాడు. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. డాన్సులు అందరికీ తెలుసు బాగా చేస్తాడని, ఇందులో ఇంకా బాగా చేశాడు. ఓవరాల్‌గా సుధీర్‌బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 
హీరోయిన్‌ వామిక క్యూట్‌గా ఉంది. బొద్దుగా ఆకట్టుకుంది. నటనతోనూ ఆకట్టుకుంది. సరిగ్గా వాడుకుంటే టాలీవుడ్‌కి మరో మంచి హీరోయిన్‌ వామిక రూపంలో దొరికినట్టే. డాన్స్‌ బాగా చేసింది, ఎనర్జిటిక్‌గా కనిపించింది. 30 ఇయర్స్‌ పృధ్వీ మరోసారి తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రవీణ్‌, వేణు, శ్రీరామ్‌, విద్యుల్లేఖ, పోసాని కృష్ణమురళి తమవంతు కామెడీతో అలరించారు. ధన్య బాలకృష్ణన్‌, చైతన్య కృష్ణ ఓకే. సాయికుమార్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాడు. 

ఒక్కరోజులో కథ అనేక మలుపులు తిరగడం కొత్తదనంతో కూడుకున్న విషయం. సినిమానీ ఇంట్రెస్టింగ్‌గా మలుపులు తిప్పాడు కొత్త దర్శకుడైనప్పటికీ. కథ, కథనం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అభినందించదగ్గవి. కామెడీ ఉన్నా, కథని డిస్టర్బ్‌ చెయ్యనివ్వలేదు. పాటలు బాగున్నాయి. మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు స్లో పేస్‌లోనే కనిపిస్తాయి. ఇక్కడే ఎడిటింగ్‌ పనితనం అవసరమనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన రీతిలో ఉపయోగపడ్డాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సినిమా తీయడమంటే సాహసమే. కమర్షియల్‌ పరిధి దాటలేక, రొటీన్‌ బాటలోనే పయనిస్తోన్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడూ విభిన్నమైన కథా నేపథ్యంలో సినిమాలొస్తుండడం ఊరట. ఆ కోవలో 'భలే మంచి రోజు' కాస్త పాజిటివ్‌ ఫీల్‌ ఇస్తుంది. కమర్షియల్‌ హంగుల కోసం పాటలూ, కామెడీ కాస్త ఎక్కువగా జోడించడం కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా ఓవరాల్‌గా ఓకే. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ స్లో స్లోగానే సాగుతున్నా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. డిఫరెంట్‌ జోనర్‌లో వచ్చిన సినిమా కావడంతో, డిఫరెంట్‌ ఫీల్‌ ఇష్టపడే ఆడియన్స్‌కి 'భలే మంచి రోజు' మంచి ట్రీట్‌ అవ్వొచ్చు. పబ్లిసిటీ చాలా బాగా చేశారు. దాంతో ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. పబ్లిసిటీ ఇంకాస్త గట్టిగా చేస్తే, కమర్షియల్‌గానూ సేఫ్‌ ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు, లాభాల ప్రాజెక్ట్‌ అనిపించుకోవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
భలే మంచిగుంది 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka