నారా రోహిత్, లతా హెగ్దే జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'తుంటరి'. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేసి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. అంతేకాదు ఫుల్‌గా నవ్వులు కూడా పండిస్తానంటున్నాడు. ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు సడెన్‌గా బాధ్యత తెలిసి పట్టుదలతో తాను అనుకున్నది సాధించే ప్రయత్నమే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో నారా రోహిత్ నటన, చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతవరకూ రోహిత్ చేసిన సినిమాల కన్నా ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెల్పుతోంది.
డైలాగ్స్ చెప్పడంలో ఇప్పటి వరకూ చూసిన రోహిత్ స్టైల్ వేరు. ఈ సినిమాలో రోహిత్ స్టైలే వేరు అని డైరెక్టర్ కుమార్ నాగేంద్ర తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో మాంచి జోరుగా, ఫుల్ ఎనర్జిటిక్‌గా నారా రోహిత్ కనిపించనున్నాడట. ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, సెన్సేషనల్ హిట్ కొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఆల్ ది బెస్ట్ టు 'తుంటరి' టీమ్.
|