Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srutihasan involves in hot sceans

ఈ సంచికలో >> సినిమా >>

డాన్స్‌తో ఫిట్‌నెస్‌ పెంచుతున్న మెగాస్టార్‌

megastar fitness improved with dance

వెయిట్‌ తగ్గాలంటే కామన్‌గా డైటింగ్‌ చేయడం, జిమ్‌లకెళ్లడం చేస్తుంటారు అందరూ. కానీ మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం అందుకు భిన్నంగా ఒక రకం డాన్స్‌ చేస్తూ తద్వారా వెయిట్‌ తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఆ డాన్స్‌ పేరే 'జాంబ'. ఎంతైనా చిరంజీవి మంచి డాన్సర్‌ కదా. ఆ డాన్స్‌ మీద ఇష్టాన్ని ఇలా ఎంజాయ్‌ చేస్తున్నారన్నమాట చిరంజీవి. ఈ డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ , తన 150వ సినిమా కోసం బాడీ ఫిట్‌నెస్‌ పెంచుతున్నారు చిరు. మొన్నీమధ్య భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో రోజులు రెస్ట్‌ తీసుకున్న చిరు ఇప్పుడు మళ్లీ కసరత్తులు, అదేనండీ డాన్స్‌ చేయడం మొదలు పెట్టాడు. ఒక పక్క చిన్న కూతురు శ్రీజ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమా ప్రిపరేషన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు.

వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తమిళ్‌ 'కత్తి' రీమేక్‌లో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే చిరు పలు వేదికల మీద మీసకట్టుతో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నారు. దాంతో మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఆయన అందానికి ఫ్యాన్స్‌ ఆనందంతో పొంగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు తమ అన్నయ్య హీరోగా తెరపై సందడి చేస్తాడో అని ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam