Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

కళ్యాణ వైభోగమే చిత్రసమీక్ష

movie review

చిత్రం: కళ్యాణ వైభోగమే 
తారాగణం: నాగశౌర్య, మాళవిక నాయర్‌, రాశి, ఆనంద్‌, ప్రగతి, ఆర్‌జె హేమంత్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 
ఛాయాగ్రహణం: జి.వి.ఎస్‌.రాజు 
నిర్మాణం: శ్రీ రంజిత్‌ మూవీస్‌ 
దర్శకత్వం: నందిని రెడ్డి 
నిర్మాత: కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ 
విడుదల తేదీ: 04 మార్చి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
శౌర్య (నాగశౌర్య) హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ, కెరీర్‌ మీద స్పష్టమైన అవగాహనతో దూసుకుపోయే కుర్రాడు. మెడికో టాపర్‌ దివ్య (మాళవిక నాయర్‌) కూడా తన కెరీర్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. అనుకోకుండా పెద్దలు వీరిద్దరికీ పెళ్ళి కుదిర్చేస్తారు. కెరీర్‌ మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్న శౌర్య, దివ్య తమ పెళ్ళిని పక్కన పెట్టేసి, కెరీర్‌లో ఇంకా ఎత్తుకు ఎదగాలనుకుంటారు. పెళ్ళి అనే బంధంలో ఇద్దరూ ఇరుక్కుపోయారా? వైవాహిక బంధాన్ని అటకెక్కించేసి తాము ఎంచుకున్న కెరీర్‌నే పరమావధిగా చూసుకున్నారా? ఈ క్రమంలో వారెదుర్కొన్న సమస్యలేంటి? అనేవి తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
నాగశౌర్య మంచి నటుడు అని ఇప్పటికే అతను నటించిన చాలా సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండి. చాలా ఈజీగా చేసుకుపోయాడు. మంచి ఈజ్‌తో పాత్రకు ప్రాణం పోశాడు. సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాల్లోనూ, ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తనదైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు.

మాళవిక నాయర్‌ స్పెల్‌ బౌండ్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌తో స్టన్‌ చేస్తుంది. కళ్ళతోనే భావాలు పలికించేయగల నటనా ప్రతిభ ఆమె సొంతం. సాదా సీదా అందగత్తె అయినా, నటనతో ప్రతి సన్నివేశానికీ అందం తీసుకొచ్చింది. తల్లి పాత్రలో అందాల నటి రాశి ఓకే. ప్రగతి, ఆర్‌జె హేమంత్‌ తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ జనరేషన్‌ యూత్‌ యాటిట్యూడ్‌ని దర్శకురాలు చక్కగా ప్రొజెక్ట్‌ చేయగలిగారు. ఇలాంటి కథలు గతంలో చూశాం. కానీ, నెరేషన్‌ విషయంలో దర్శకురాలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా అంతా కొత్తగా, ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. మ్యూజిక్‌ బావుంది. పాటలు తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి. ఎడిటింగ్‌ బాగున్నా, సెకెండాఫ్‌లో అక్కడక్కడా ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరింది. సినిమాకి రిచ్‌నెస్‌ రావడంలో సినిమాటోగ్రఫీ పాత్ర చాలా ఎక్కువ. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉండి, సినిమాకి ప్లస్సయ్యాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌ ఎమోషనల్‌ టచ్‌తో సాగుతుంది. ప్రస్తుత యువతరం ఆలోచనల్ని దర్శకురాలు చాలా బాగా చూపించారు. అలాగే, కుటుంబ విలువల్ని హృదయానికి హత్తుకునేలా చూపడంలో దర్శకురాలు సఫలమయ్యిందని చెప్పవచ్చు. సింపుల్‌ అండ్‌ క్లీన్‌ ఎంటర్‌టైనగర్‌గా సినిమాని తెరకెక్కించడంలో దర్శకురాలి విజన్‌ అభినందనీయం. సెకెండాఫ్‌లో ఎమోషన్‌ ఫీల్‌ కాస్త ఎక్కువైనా, సినిమాకి అవసరమే అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టచ్‌ చేస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే 

నిజంగానే ఈ కళ్యాణం వైభోగమే

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
bahubali relese date fix