సహజంగానే శృతి హాసన్ అంటే నటనకూ, అందానికి పెట్టింది పేరు. ఆమె నటనలో ఎక్కడా పేరు పెట్టే ఆస్కారమే ఉండదు. విశ్వనటుడి కూతురు కదా మరి. అదంతే. అయితే నటించేటప్పుడు అమ్మడు తన పాత్రలో ఇన్‌వాల్వ్ అయిపోయి నటిస్తుందట. అందుకే ఆ సీన్ అంత బాగా రక్తి కడుతుంది అంటోంది ముద్దుగుమ్మ శృతిహాసన్. హాట్ హాట్ సీన్స్‌లో అయితే తనను తానే మైమరిచిపోయి నటిస్తుందట. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్ల తనకు ఏ మాత్రం ఇబ్బంది కలగదంటోంది ఈ హాటెస్ట్ భామ శృతి హాసన్.
అది నటనే కదా అని చెబుతుందీ భామ. ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ 'ప్రేమమ్' లో నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంది శృతిహాసన్. అంతేకాదు ఇంతవరకూ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ వంటి టాలెంట్స్‌తో అలరించిన శృతి ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పబోతోంది. తెరపై హాట్ హాట్‌గా కనబడే శృతి ఇప్పుడు స్వీట్ స్వీట్‌గా మాట్లాడేస్తానంటోంది. తెలుగుతో పాటు హిందీ, తమళంలో కూడా హవా చూపిస్తున్న శృతి, ఇకపై తెలుగు తెరపై తన సొంత గొంతుతోనే అలరిస్తానంటోంది.
|