Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anchors becomes heroins

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ ఉగాది గిఫ్ట్‌ అదుర్స్‌

mahesh ugadi gift adurs

జనవరి 1న తన సినిమా టీజర్‌తో అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ ఇప్పుడు తెలుగు సంవత్సరాదికి కూడా గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్తున్నాడు. ఉగాది సందర్భంగా 'బ్రహ్మ్తూెత్సవం' సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశాడు. ఫస్ట్‌ టీజర్‌తోనే కలర్‌ఫుల్‌గా ఆట్టుకున్నాడు సూపర్‌ స్టార్‌. ఇప్పుడు విడుదలైన ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్‌ ఆనందానికి అంతే లేదు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందన్న ఆశక్తితో ఎదురు చూస్తున్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్‌, సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్‌ 24వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. 'బ్రహ్మూెత్సవం' ఉగాది లుక్‌లో, హీరో మహేష్‌, ఎవరి పాదాలకో చెప్పులు తొడుగుతున్నాడు. మహేష్‌ అంటే సూపర్‌ స్టార్‌. ఓవర్సీస్‌ మార్కెట్‌కి రారాజు. మాస్‌లోనూ తిరుగులేని ఇమేజ్‌ ఉంది. అంతటి పెద్ద హీరోతో ఇంత సింపుల్‌గా సినిమా లుక్‌ని రివీల్‌ చేయడం సాహసమే. శ్రీకాంత్‌ అడ్డాల సినిమాల స్టైలే వేరుగా ఉంటుంది. ఆ స్టైల్‌ ఇదిగో ఇలా అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని సినిమా కబుర్లు
nani new flim evaditadu?