Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Writers in America - NATS

ఈ సంచికలో >> సినిమా >>

‘శృతి’మించిపోతోంది

Shruti Hasan - Golden Leg

‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా తెలుగులో ఆమెకు నిరాశ పరిచింది. అంతకు ముందు బాలీవుడ్‌లో తొలి చిత్రం ‘లక్‌’ కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టలేదు. దాంతో శృతిహాసన్‌ని అందరూ ఐరన్‌ లెగ్‌ అనక తప్పలేదు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ ఐరన్‌ లెగ్‌ ఇప్పుడు గోల్డెన్‌ లెగ్‌ అయ్యింది.

‘గబ్బర్‌సింగ్‌’ సినిమాతో శృతిహాసన్‌ దశ తిరిగింది. ‘బలుపు’ సినిమాతో ఆమె గోల్డెన్‌ లెగ్‌ అయ్యింది. శృతి నటిస్తే ఆ సినిమా సూపర్‌ హిట్టే.. అనుకుంటున్నారంతా. చేతిలో ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’ తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.

బాలీవుడ్‌లోనూ ‘డి`డే’ సినిమాతో హిట్‌ కొట్టింది. తెలుగు ‘రామయ్యా వస్తావయ్యా’ నిర్మాణ దశలో వుండగా, అదే పేరుతో హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ‘రామయ్యా వస్తావయా’ కమర్షియల్‌ విజయాన్ని అందుకుంది. నటన, దాంతోపాటే గ్లామర్‌ డోస్‌ కూడా పెంచడంతో అవకాశాలు ‘శృతి’మించుతున్నాయిప్పుడు.

అందుకే తెలుగు, హిందీ భాషల్లో శృతిహాసన్‌ టాప్‌ హీరోయిన్ల రేసులో దూసుకుపోతోందనడం నిర్వివాదాంశమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
Ghazal Srinivas in to movies agian