Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

ప్రకాశ్ రాజ్ సక్సెస్ సీక్రెట్
’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అందరూ చూసే వుంటారు. అందులో ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ప్రసన్నంగా నవ్వుతూ వుంటాడు. షూటింగ్ రోజు ఆయన వచ్చి తన పాత్ర స్వభావం తెలుసుకున్నారు. ’మీరిందులో ఎస్వీ రంగారావు గారికి మనవడవుతారు’ అని చెప్పారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ’ఆయన ఫొటో ఏదైనా ఇంట్లో వుంటుందా ?’ అని అడిగారు ప్రకాశ్ రాజ్. ఆ సినిమాలో మనకి చూపించే ఎస్వీరంగారావు, సూర్యకాంతం ఉన్న ఫొటోని చూపించారు శ్రీకాంత్ అడ్డాల.

’అయితే మీరందరూ ఇక్కడ్నించి వెళ్ళిపోయి ఈ రూమ్ నాకు వదిలెయ్యండి. ఓ అరగంట పాటు నన్ను డిస్టర్బ్ చెయ్యకండి’ అన్నారు ప్రకాశ్ రాజ్. అలాగేనని అందరూ వెళ్ళిపోయారు. ఓ అరగంట పాటు మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఆ ఫొటోనే చూస్తూ వుండిపోయారు ప్రకాశ్ రాజ్ ఏకాగ్రతతో. ఆ తర్వాత నుంచి సినిమా పూర్తయ్యేవరకూ తన ఎక్స్ ప్రెషన్స్ లో ఏ మార్పు లేకుండా ఎన్ని షెడ్యూల్స్ వేసినా ఒకేలా కనబడుతూ ప్రకాశ్ రాజ్ ఎంత బాగా నటించారో అందరికీ తెలిసినదే. అదీ అంకితభావం అంటే... ప్రకాశ్ రాజ్ సక్సెస్ వెనుక నున్న రహస్యం కూడా ఇదే.

పకడో పకడో (అవుటాఫ్ ఫోకస్)


చాలా కాలం క్రితం ’దొరికితే దొంగలు’ అనే సినిమా వచ్చింది. ఎన్టీఆర్, జమున హీరో హీరోయిన్లు. గుమ్మడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎన్టీఆర్. చిన్నప్పుడే తప్పిపోతాడు. చిన్నవాడు కాంతారావు. సైంటిస్ట్ అయినా ప్రలోభాలకు చిక్కి విలన్ల చేతిలో బానిసైపోతాడు. క్లైమాక్స్ లో గుమ్మడికి, ఎన్టీఆర్ కి తాము తండ్రీ కొడుకులమని తెలుస్తుంది. కాంతారావుకి తెలియదు. అంచేత ఎన్టీఆర్ మీద కాల్పులు జరుపుతాడు.

గుమ్మడికి కోపం వచ్చి కాంతారావుని కాల్చేస్తాడు. అక్కడ ఎన్టీఆర్ డైలాగ్ ఇలా వినిపిస్తుంది - ’ నాన్నా ... మీ చేతుల్తో మీ తమ్ముణ్ణి కాల్చి చంపుతారా ?’

నిజానికి అక్కడ ఎన్టీఆర్ డైలాగ్ ’ నాన్నా ... మీ చేతుల్తో మీ కొడుకుని కాల్చి చంపుతారా ?’ అని గానీ లేదా ’నాన్నా ... మీ చేతుల్తో తమ్ముణ్ణి కాల్చి చంపుతారా ?’ అని వుండాలి. అలా కాకుండా ’నాన్నా ... మీ చేతుల్తో మీ తమ్ముణ్ణి (?) కాల్చి చంపుతారా ?’ అని వుండడం ఎవరికైనా సరే ఆశ్చర్యం కలిగిస్తుంది. కావాలంటే ఈ సినిమా యూ ట్యూబ్ లో దొరుకుతుంది. క్లైమాక్స్ పార్ట్ చూడండి. మీకే తెలిసిపోతుంది..






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam