Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అభిమానులూ ఆలోచించండి

fans think

నేత్రదానం చేయమంటూ మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు చాలాకాలం క్రిందటే పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి స్పందించి ఎందరో నేత్రదానం కోసం ముందుకొచ్చారు. సినీ అభిమానులు రక్తదానం చేయడం చాలా సర్వసాధారణం, చాలా అభినందనీయమైన విషయం కూడా. అభిమానులు సేవా కార్యక్రమాలతో తమ అభిమాన హీరో పేరు ప్రఖ్యాతుల్ని ఇంకా పెంచేస్తుంటారు. తద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని ఘటనలు ఇటు అభిమానులకీ, అటు హీరోలకీ బాధ కలిగించడమేగాక, చెడ్డపేరు తీసుకొస్తుంటాయి.

అటు కన్నవారికీ కడుపుకోత మిగుల్చుతుంటాయి. పవన్‌కళ్యాణ్‌ అభిమాని వినోద్‌ రాయల్‌ కర్నాటకలో హత్యకు గురైన ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. విషయం తెలుసుకున్న పవన్‌కళ్యాణ్‌ మృతిచెందిన వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఇంకో అభిమాని చేతిలో వినోద్‌ హత్యకు గురికావడం చాలా దారుణమైన విషయం. ఏ హీరో గొప్ప? అన్న అంశమే ఈ హత్యకు దారి తీసినట్లు తెలియవస్తోంది. హీరోలమంతా కలిసే ఉంటాం, ఆ విషయం అభిమానులు తెలుసుకోవాలని పవన్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. పవన్‌ ఒక్కడే కాకుండా హీరోలందరూ తమ అభిమానులను ఎడ్యుకేట్‌ చేయాల్సిన సందర్భమిది. సినిమాకి అభిమానులే బలం. అభిమానులు లేకపోతే, స్టార్‌ హీరోల సినిమాలు సాధారణ సినిమాలైపోతాయి. అలాంటి అభిమానులు ఇలాంటి గొడవలతో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఏ అభిమానీ, ఇంకో హీరోపై బురదజల్లే ప్రయత్నం చేయకూడదు, అభిమానం ముసుగులో రాక్షస చర్యలకు పూనుకోకూడదు. 

మరిన్ని సినిమా కబుర్లు
druva is comming