Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
arjunreddy what a victory

ఈ సంచికలో >> సినిమా >>

'నర్తనశాల' - బాలయ్య కోరిక తీరేదెలా?

balayya dream project

బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'నర్తనశాల' సినిమా చేయాలని. కానీ ఆ సినిమా చేయాలంటే హీరోయిన్‌ సౌందర్య ఉండాలంటున్నారు ఆయన. సౌందర్య లేకుండా ఆ సినిమా చేయడం అసాధ్యం అంటున్నారు. అరదుకే అది జస్ట్‌ డ్రీమ్‌లానే ఉండిపోయింది. ఇకపై ఆ సినిమా సెట్స్‌ మీదికెళ్లడం కూడా ఓ డ్రీమే. ఎందుకంటే నటి సౌందర్య ఇప్పుడు జీవించి లేదు. అలాగే ఆ సినిమాని తెరకెక్కించగలిగే సత్తా బాపు లాంటి డైరెక్టర్‌కే ఉందనీ బాలయ్య అంటున్నారు. ఆ ఇద్దరూ ప్రస్తుతం జీవించి లేనందున ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పట్టాలెక్కదేమో అని కూడా ఆయన అంటున్నారు. ఎంత గొప్ప డైరెక్టర్స్‌, గొప్ప హీరోయిన్స్‌ ఉన్నప్పటికీ బాలయ్య 'నర్తనశాల'కి మాత్రం ఆ ఇద్దరే ఉండాలని చెప్పడం విశేషం. అది ఆయన డెడికేషన్‌కి సంబంధించిన విషయం. కొన్ని పౌరాణిక పాత్రలకు కొందరు నటీ నటులు అలా ఫిక్స్‌ అయిపోతారంతే. వారి ప్లేస్‌ని భర్తీ చేయడం ఇంకెవ్వరి వల్లా కాదని బాలయ్య అభిప్రాయం. అంతేకాదు ఆయన డైరెక్టర్స్‌ మెచ్చే హీరో. డైరెక్టర్స్‌కి తను ఎలా కావాలనుకుంటే ఆలా తనని తాను మార్చేసుకుంటారు. పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటారు. ఆడియన్స్‌, అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో, ఆ యాంగిల్‌ నుండి ఫస్ట్‌ తనని డైరెక్టర్‌ చూస్తాడు. అందుకే తన సినిమాల విషయంలో పూర్తి బాధ్యత డైరెక్టర్‌కే అప్పగించేస్తానని ఆయన అంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేందుకే బాలయ్య ట్రై చేస్తారు. వయసు పెరిగినా, పాతికేళ్ల కుర్రాడి ఉత్సాహం సెట్స్‌లో ఉన్నప్పుడు బాలయ్యలో కనిపిస్తుంది. అదే టీమ్‌కి అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దాంతో ఆయనతో సినిమా అంటే టెక్నీషియన్స్‌కీ ఓ పండగలా ఉంటుంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
rajugari entry with rudraksha mala