Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar saira shoting ready

ఈ సంచికలో >> సినిమా >>

విజయ్‌, రష్మిక - కిరిక్‌ మ్యాజిక్‌

vijay, rashmika, kirik magic

విజయ్‌ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్‌, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన హీరోయిన్‌గా కన్నడ భామ రష్మిక మండన్న ఎంపికైంది. తెలుగు సినీ పరిశ్రమ ఆహ్వానం పలుకుతోందంటూ ఆమెకు వెల్‌కమ్‌ చెప్పిన విజయ్‌ దేవరకొండ, కిరిక్‌ మ్యాజిక్‌ చేసేద్దామంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ నుంచి వస్తోన్న సినిమా ఇది. 'అర్జున్‌రెడ్డి' అత్యద్భుత విజయాన్ని అందుకున్న దరిమిలా గీతా ఆర్ట్స్‌లో విజయ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉంటాయి. అలాంటి సినిమాతో తెలుగు తెరపైకొస్తోన్న రష్మిక దశ తిరగనుందని చెప్పడం నిస్సందేహం.

వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. అల్లు అర్జున్‌తోనూ, ప్రబాస్‌తోనూ ఈ ముద్దుగుమ్మ జత కట్టనుందని గాసిప్స్‌ గుప్పుమన్నాయి. కానీ అలా జరగలేదు. అలా ఎంట్రీకి ముందే సెన్సేషన్‌ అయిపోయింది రష్మిక. అయితే స్టార్‌ హీరోలతో కాకపోయినా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ సెన్సేషనల్‌ హీరోతోనే జరుగుతుండడం విశేషం. కన్నడలో ఈ భామ యాక్టింగ్‌ టాలెంట్‌కి అంతా ఫిదా అయిపోయారు. ఇక్కడ అమ్మడి టాలెంట్‌ ఏ రేంజ్‌లో ప్రదర్శిస్తుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
balakrishna son enter in flim idustry