Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

యుద్ధం శరణం చిత్రసమీక్ష

yuddham saranam movie review

చిత్రం: యుద్ధం శరణం 
తారాగణం: నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్‌, రావు రమేష్‌, రేవతి, మురళీ శర్మ, ప్రియదర్శి, రవివర్మ తదితరులు. 
సంగీతం: వివేక్‌ సాగర్‌ 
సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి 
దర్శకత్వం: కృష్ణ ఆర్‌వి మరిముత్తు 
నిర్మాత: రజని కొర్రపాటి 
నిర్మాణం: వారాహి చలన చిత్రం 
విడుదల తేదీ: 08 సెప్టెంబర్‌ 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 

ఎగిరే డ్రోన్ల తయారీ మీద ఆసక్తితో ఆ ప్రయత్నం చేస్తుంటాడు బాగా చదువుకున్న ఓ కుర్రాడు అర్జున్‌ (నాగచైతన్య). అర్జున్‌ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ప్రజాసేవ కోసం స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పేదలకు వైద్య సహాయం అందిస్తుంటారు. వారి దగ్గర ట్రైనీగా పనిచేయడానికొచ్చిన అంజలి (లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడ్తాడు అర్జున్‌. కానీ అర్జున్‌ ఊహించని ఘటన తన కుటుంబంలో చోటు చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ అదృశ్యమవుతారు. అసలేం జరిగింది? అర్జున్‌ ఆ తర్వాత ఏం చేశాడు? తన ప్రేమ సంగతి ఏమయ్యింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 

ఈ తరహా పాత్రలు నాగచైతన్యకి టైలర్‌ మేడ్‌ అని చెప్పవచ్చునేమో. అర్జున్‌ పాత్రలో నాగచైతన్య చాలా బాగా చేశాడు. ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌లోనూ, యాక్షన్‌ సీన్స్‌లోనూ అలాగే ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. నటుడిగా నాగచైతన్య టాలెంట్‌ని ఈ సినిమా ఇంకాస్త ఎలివేట్‌ చేసిందనే అనుకోవచ్చు. 

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి సహజమైన అందానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఆమె క్యూట్‌గా కనిపించింది. నటన పరంగానూ ఆమెకు మంచి మార్కులు పడతాయి. అయితే ఫస్టాఫ్‌లో ఆమెకు ఉన్నంత ప్రాముఖ్యత, సెకెండాఫ్‌లో లభించలేదు. ఉన్నంతలో ఆమె చాలా బాగా చేసింది. 
ఈ సినిమాతో శ్రీకాంత్‌ విలన్‌గా మెప్పించాడు. మొదట్లో యంగ్‌ విలన్‌గా చాలా సినిమాలు చేసిన శ్రీకాంత్‌, చాలాకాలం తర్వాత పూర్తిస్థాయి విలన్‌గా కనిపించడం కొత్తగా అనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో పవర్‌ఫుల్‌ విలన్‌ వచ్చాడనే అనుకోవాలి. విలన్‌ పాత్రని ఎలివేట్‌ చేసినట్లే చేసి, కొంత డల్‌ చేసేయడంతో శ్రీకాంత్‌ టాలెంట్‌ కొంతవరకే పరిమితమైనట్లనిపిస్తుంది.  మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. కామెడీ పరంగా దర్శకుడు ఇంకాస్త ఛాన్స్‌ తీసుకుని ఉంటే ప్రియదర్శి తదితర కమెడియన్లు సత్తా చాటేవారే. 

తెలుగులో తొలి సినిమానే అయినా, దర్శకుడు తొలి సినిమాతోనే కొత్తదనం కోరుకున్నాడు. నాగచైతన్య గత సినిమాల ప్రభావం కావొచ్చేమోగానీ, ఇంకాస్త కొత్తగా నాగచైతన్యను చూపించాలనుకున్నట్టున్నాడు దర్శకుడు. నాగచైతన్య నుంచీ దర్శకుడికి పూర్తి సహకారం లభింనట్లే కన్పించింది. అయితే ఫస్టాఫ్‌ని ఎంటర్‌టైనింగ్‌గా, స్పీడ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా మలిచిన దర్శకుడు సెకెండాఫ్‌కి వచ్చేసరికి సినిమాని వేగంగా నడిపించలేకపోయాడు. కథ బాగున్నా, కథనం సెకెండాఫ్‌లో కొంత నెమ్మదించింది. మాటలు బాగున్నాయి. సంగీతం ఓకే. పాటలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా రాజీపడలేదు నిర్మాతలు. 

సరదా సరదాగా ఫస్టాఫ్‌ సాగిపోతూనే, ఓ కొత్త ఫీల్‌ కలిగిస్తుంది. అయితే సెకెండాఫ్‌కి వచ్చేసరికి కథనంలో వేగం తగ్గిపోతుంది. ఎమోషనల్‌ సీన్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇవన్నీ సినిమా వేగాన్ని కొంత తగ్గించినట్లుగా అనిపిస్తాయి. ఫ్యామిలీ డ్రామా నుంచి రివెంజ్‌ స్టోరీలోకి ట్రాన్స్‌ఫామ్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో వేగం పెరిగేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఇంకోలా ఉండేది. మొత్తంగా చూసినప్పుడు నాగచైతన్య నటన, సినిమా కాన్సెప్ట్‌ ఇవన్నీ ఓ మంచి ఫీల్‌ని మిగుల్చుతాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌, సెకెండాఫ్‌ ఎమోషన్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka