Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mulakkaada pappuchaaru

ఈ సంచికలో >> శీర్షికలు >>

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ఇవే… - ..

the reasons for your skin is dry in winter

చలికాలంలో మన చర్మం పొడిగా మారటం చాలా సాధారణమే కాదా అని అనుకుంటాము, కానీ దీనికి కారణాలు ఎన్నో, నమ్మకమ కలగటం లేదా? అయితే ఇది చదవండి.

చలికాలంలో పొడి చర్మం
చలికాలంలో చర్మం పొడిగా మారటానికి చలి కారణం అనుకుంటారు. కానీ, ఈ కాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవును, మనం వాడే మందులు, రోజు వారి కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం వంటివి కారణం కావచ్చు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

వేడితో నీటి స్నానం
చలికాలంలో నీటిని తాకాలంటే కూడా భయమే! ఈ కాలంలో మనం ముఖం కడుక్కోవాలన్న కూడా వేడి నీటి కోసం చూస్తూంటాము. అవునా! ఇంకా స్నానానికైతే మరిగే నీరు కావాల్సిందే. కానీ, వేడి నీరు మనం చర్మంలో ఉండే సహజ తేమ మరియు నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుందని చేలా మందికి తెలియని విషయం. కావున ఈ రోజు నుండి వేడి నీటిని కాకుండా, గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయండి.

ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం
చలికాలం వచ్చిందంటే చాలు టోనర్స్, లోషన్, బాడీ క్రీములు కొని తెచ్చి పెట్టుకుంటాము. కానీ కొన్ని రకాల ఉత్పత్తులు ఆల్కహాల్ ను కలిగి ఉంటాయి, ఆల్కహాల్ కలిగి ఉండే ఉత్పత్తుల వాడకం వలన చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. మీ చర్మం పొడిగా ఉండకూడదు అంటే ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

జన్యుపర సంక్రమణ
పొడి చర్మం కూడా వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని చెప్తే మీకు నవ్వు రావచ్చు! కానీ ఇది నిజం. అవును మీ కుటుంబీకులలో ఎవరైన పొడి చర్మం కలిగి ఉంటే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మందుల వాడకం
శరీర కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు, కేన్సర్ నివారణా మందులు వాడుతున్నారా? అయితే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రకమైన మందుకు వాడే వారిలో చర్మం పొడిగా మారి పొలుసులుగా రాలుతుంది

మరిన్ని శీర్షికలు
Paper craftPaper Popper making with color paper