Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nani in summer race

ఈ సంచికలో >> సినిమా >>

సౌత్‌లో సన్నీ తళుకులు

sunny in south

సన్నీలియోన్‌ అంటేనే ఓ సెన్సేషన్‌. పోర్న్‌ రంగం నుండి వచ్చి, ఇండియన్‌ సినిమాలో సెక్సీ భామగా ఎదిగిన ఈ బ్యూటీ పేరు ఇప్పుడు సౌత్‌లో మార్మోగిపోతోంది. బాలీవుడ్‌లో సినిమాలు చేసినా కానీ సన్నీ పేరు సౌత్‌లో వినిపించింది. అయితే ఇప్పుడు వినిపించేది అలా కాదు. ఈ ముద్దుగుమ్మ మెల్లగా సౌత్‌లోకి అడుగుపెట్టేసింది. తన తళుకు బెళుకు అందాలను సౌత్‌ ప్రేక్షకులకూ పరిచయం చేసేసింది. అయితే ఇంతవరకూ ఈ హాట్‌ బ్యూటీ హాట్‌ హాట్‌ ఐటెం సాంగ్స్‌లోనే నటించింది. ఇకపై ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించబోతోంది. సన్నీలియోన్‌ సౌత్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకి తాజాగా టైటిల్‌ని ప్రకటించారు. 'వీర మహాదేవి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో సన్నీలియోన్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇదో చారిత్రాత్మక చిత్రం కావడం విశేషం.

ఇంతవరకూ హాటెస్ట్‌ భామగానే పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇకపై టాలెంట్‌తోనూ ఆకట్టుకోవాలనుకుంటోంది. తమిళ దర్శకుడు వడి ఉదయన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. సన్నీలియోన్‌ గెటప్‌ సరికొత్తగా ఉండబోతోంది ఈ సినిమాలో. ఇంతవరకూ సన్నీ నటించిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఇటీవలే తెలుగులో 'గరుడవేగ' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించింది సన్నీలియోన్‌. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో సన్నీకి మంచి గుర్తింపు దక్కింది. ఇక తాజా సినిమాతో సన్నీలియోన్‌ సౌత్‌లో పాగా వేయడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చేస్తోందట సన్నీ. ఇలాంటి సినిమాలో నటించడం తనకెంతో సంతోషంగా ఉందంటోందీ హాట్‌ హాట్‌ సన్నీలియోన్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
Sunil's Trivikram Galli Cricket