Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sunny in south

ఈ సంచికలో >> సినిమా >>

సునీల్‌తో త్రివిక్రమ్‌ గల్లీ క్రికెట్‌?

Sunil's Trivikram Galli Cricket

'త్రివిక్రమ్‌ ఇప్పుడు వరల్డ్‌ కప్‌ ఆడుతున్నాడు. నాతో సినిమా చేయడం అంటే మళ్లీ గల్లీలో క్రికెట్‌ ఆడాలి. అయినా కానీ అలా మేమిద్దరం కలిసి సినిమా చేసే ఛాన్స్‌ ఖచ్చితంగా వస్తుంది. త్రివిక్రమ్‌ రాసే కథ, హీరోగా నన్ను డిమాండ్‌ చేయాలి. అంతేతప్ప నాకో సినిమా చేసి పెట్టు అని అడిగితే, అందుకోసం త్రివిక్రమ్‌ కథ తయారు చేసినట్లుండకూడదు..' అని అంటున్న మాటలు ఎవరివనుకుంటున్నారా? కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌వి. ఈ ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. భీమవరం నుండి వచ్చి ఈ ఇద్దరూ రూమ్‌మేట్స్‌గా ఉంటూ, సినీ కెరీర్‌లో తమ కష్ట సుఖాల్ని పంచుకున్న మంచి స్నేహితులు.

ఇప్పటికీ వీరి మధ్య స్నేహం ఉంది. అయితే దారులే వేరు. తెర వెనుక ఉండి, తెరపై మాటలతో మ్యాజిక్‌ చేసే మాంత్రికుడు ఒకరైతే, తెరపై తూటాల్లాంటి పంచ్‌ డైలాగులతో ఆకట్టుకునేది మరొకరు. త్రివిక్రమ్‌ ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. 'ఓ స్నేహితుడిగా త్రివిక్రమ్‌ ఎదుగుదలను నేను ఎంజాయ్‌ చేస్తున్నాను అంటున్నాడు సునీల్‌. కమెడియన్‌గా డిఫరెంట్‌ శైలి పంచ్‌ డైలాగులతో ఆకట్టుకున్నాడు ఒకప్పుడు. హీరోగా మారి తనదైన స్టైల్‌లో సక్సెస్‌లు అందుకున్నాడు. అయితే ప్రస్తుతం సునీల్‌ కెరీర్‌ కొంచెం స్లో అయ్యిందనే చెప్పాలి. అయితే వచ్చే ఏడాది మాత్రం సునీల్‌ కొత్త అవతారం చూస్తారంట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సే. హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు కన్‌ఫామ్‌ చేశాడట. కమెడియన్‌గా తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిన కామెడీని మరోసారి టచ్‌ చేస్తానంటున్నాడు సునీల్‌. అది కూడా వచ్చే ఏడాదిలోనేనట. కొన్ని సినిమాల్లో ఇంపార్టెన్స్‌ ఉన్న రోల్స్‌కి సైన్‌ చేశాడట. అవేంటో త్వరలో చెబుతానంటున్నాడు. మొత్తానికి వచ్చే ఏడాది సునీల్‌ జోరు ప్రదర్శించనున్నాడని తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam