Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రంగస్థలం చిత్రసమీక్ష

rangastalam movie review

చిత్రం: రంగస్థలం 
తారాగణం: రామ్‌చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, అనసూయ, నరేష్‌, రోహిణి, రాజీవ్‌ కనకాల తదితరులు. 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు 
దర్శకత్వం: సుకుమార్‌ 
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి 
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌ 
విడుదల తేదీ: 30 మార్చి 2018

క్లుప్తంగా చెప్పాలంటే

రంగస్థలం అనే గ్రామంలో పంప్‌ సెట్‌ నడుపుతుంటాడు చిట్టిబాబు (రామ్‌చరణ్‌). అతని సోదరుడు కుమార్‌బాబు (ఆది) ప్రెసిడెంట్‌ ఫణీంద్రభూపతి 30 ఏళ్ళుగా సేవలందిస్తుంటాడు. గ్రామంలో ఆయన చెప్పిందే వేదం. ఆయన్ని చూస్తే అందరూ భయపడ్తారు. అంతలా జనాన్ని భయపెడ్తుంటాడు ఫణీంద్రభూపతి. చిట్టిబాబుని ప్రేమిస్తోన్న రామలక్ష్మి (సమంత)ని ఇబ్బంది పెడుతున్న ఫణీంద్రభూపతిని ఎదుర్కొనడానికి సిద్ధపడతాడు కుమార్‌బాబు. ఆ కుమార్‌బాబు సోదరుడికి అండగా నిలుస్తాడు చిట్టిబాబు. ప్రెసిడెంట్‌తో తలపడేందుకు సిద్ధమైన కుమార్‌బాబుకి, చిట్టిబాబు ఎలా అండదండలందించాడు? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే

చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్‌ జీవించేశాడనడం కూడా చిన్న మాటే. నటుడిగా అతనికిది చాలా చాలా ప్రత్యేకమైన సినిమా. అసలు ఇలాంటి పాత్ర చరణ్‌ ఎందుకు ఒప్పుకున్నాడు? అని అనుమానం వ్యక్తం చేసినవారికి, ఈ పాత్రని చరణ్‌ చేయకపోయి వుంటే చాలా లాస్‌ అయ్యేవాడనిపిస్తుందిప్పుడు. అంతలా ఆ పాత్రలో చిట్టిబాబు భళా అనిపించుకున్నాడు. నటుడిగా చరణ్‌ ఈసారి పూర్తి మార్కులే కాదు, బోనస్‌ మార్కులు కూడా కొట్టేస్తాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతలా ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు రామ్‌చరణ్‌. ఈ విషయంలో చరణ్‌కి హేట్సాఫ్‌ చెప్పి తీరాల్సిందే.

హీరోయిన్‌ సమంత క్యూట్‌గా కన్పించింది. పల్లె పడుచు అందాల్ని సమంత చాలా బాగా చూపించింది. తన పాత్రకు అవసరమైన మేర క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించి నటనతో మెప్పించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. అనసూయ పాత్ర ఓకే. ఆమె తన పాత్రలో ఒదిగిపోయింది. ఆది బాగా చేశాడు. జగపతిబాబుకి మంచి పాత్ర దక్కింది, దానికాయన న్యాయం చేశారు. ప్రకాష్‌రాజ్‌ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించి మెప్పించారు.

ఇలాంటి కథలతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ముప్ఫయ్యేళ్ళ క్రితం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించాలనే ఆలోచనే కొత్తదనంతో కూడుకున్నది. కథనం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళతాయి. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఇనిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీనే బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి మరో అదనపు బలంగా చెప్పొచ్చు. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది.

సినిమా ప్రారంభమయిన కాస్సేపటికే మనం కూడా 'రంగస్థలం'లోకి వెళ్ళిపోతాం. ఆ పాత్ర మధ్య మనమూ వున్నామన్న భావన కలుగుతుంది. అంతలా దర్శకుడు సహజత్వానికి దగ్గరగా తీశాడు సినిమాని. కమర్షిల్‌ హంగుల కోసం ప్రత్యేకంగా పాకులాడలేదుగానీ, కథలోనే అంతర్లీనంగా కామెడీ పుట్టుకొస్తుంటుంది అక్కడక్కడా. కొన్ని పాటలు మాస్‌ని మేగ్జిమమ్‌ మెప్పించేస్తాయి. నటీనటుల నటనా ప్రతిభ, గోదావరి అందాలు, ఎమోషనల్‌ కంటెంట్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ అన్నీ ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా సినిమాని ఓ కంప్లీట్‌ ప్యాకేజీగా అభివర్ణించొచ్చు. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో కాస్తంత సాగతీత అన్పిస్తుంది. అయినా, దాన్ని సైతం యాక్సెప్ట్‌ చేయగలిగేలా సినిమాని దర్శకుడు తీర్చిదిద్దాడు. నిడివి తగ్గించి, షార్ప్‌గా ఎడిటింగ్‌ చేసి వుంటే సినిమాకి వంక పెట్టడానికి వీలుండేది కాదు.

ఒక్క మాటలో చెప్పాలంటే
రంగస్థలం - నటుడిగా చరణ్‌కి ది బెస్ట్‌ మూవీ

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

రంగస్థలం చిత్ర విశేషాలు....ఆసక్తికరమైన కథనాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.....

http://www.ratingdada.com/1/telugu-movie-reviews-ratings

మరిన్ని సినిమా కబుర్లు
churaka