Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
varma impressed

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్‌ సినిమా పట్టాలెక్కిందోచ్‌.!

akhil movie


ఎట్టకేలకు అఖిల్‌ సినిమా పట్టాలెక్కింది. తొలి సినిమా 'అఖిల్‌' భారీగా నిరాశ పరచడంతో చాలా గ్యాప్‌ తీసుకుని 'హలో' సినిమాతో రీ లాంఛ్‌ అయ్యాడు అక్కినేని అందగాడు అఖిల్‌. అందం, పర్సనాలిటీ అన్నీ ఉండి, ఫ్యూచర్‌ గోల్డెన్‌ స్టార్‌ అవ్వగల సత్తా ఉన్నప్పటికీ, అఖిల్‌కి వరుస ఫ్లాపులతో కెరీర్‌ గాడిన పడడం లేదు. కలిసి రావడం లేదు కదా అని గ్యాప్‌ తీసుకోవడం సబబు కాదని అఖిల్‌ నిర్ణయించుకున్నాడట. దాంతో యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో తన మూడో సినిమాని షురూ చేశాడు. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా అఖిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడనీ సమాచారమ్‌. ఈ సినిమాతో పాటు, మరో సినిమాని కూడా పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడట. ఇక ఈసారి సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, వరుసపెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నాడట అఖిల్‌. నాగార్జున సూచనల మేరకు అఖిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అర్జంటుగా అఖిల్‌కి ఇప్పటికిప్పుడు ఓ హిట్‌ పడితే, ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మరింత ఫాస్ట్‌గా తర్వాతి సినిమాలు చేసేందుకు అవకాశముంటుంది. అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున ఎలాగూ దూకుడు మీదున్నాడు. చైతూ తన కెరీన్‌ని బాగానే బిల్డప్‌ చేసుకుంటున్నాడు. ఇక అక్కినేని అందగాడు అఖిల్‌ కెరీర్‌ కూడా ఓ గాడిన పడితే, అక్కినేని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతారు. 'తొలిప్రేమ' సినిమాతో వరుణ్‌తేజ్‌కి మంచి హిట్‌ ఇచ్చిన వెంకీ అట్లూరి అఖిల్‌ని ఈ సారి కొత్తగా ప్రమోట్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు. హిట్‌ ఫార్ములాలో ఉండాల్సిన అన్ని కమర్షియల్‌ హంగుల్నీ పుష్కలంగా జోడించి, సింపుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 

మరిన్ని సినిమా కబుర్లు
ntr biopic start