Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta turn

ఈ సంచికలో >> సినిమా >>

చైతన్య రథసారధి ఇకలేరు.!

Chaitanya the chariot is no more

సెప్టెంబర్‌ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. అయితే ఈ సారి ఆయన తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దు.. ఆ పుట్టినరోజు వేడుకల కోసం వ్యత్యించే మొత్తాన్ని కేరళ వరద బాధితుల కోసం వినియోగించండి అని ఓపెన్‌గా ఫ్యాన్స్‌కి ఓ లేఖ రాశారు. ఇదే విషయమై ఆయన ప్రెస్‌ మీట్‌ పెట్టి అభిమానులకు సూచించాలని అనుకున్నారు. ఇంతలోనే మృత్యువు ఆయన్ని అనుకోని మార్గంలో కబళించివేసింది. చైతన్య రథ సారధి అందని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నెల 29 తెల్లవారుజామున 4 గంటల సమయంలో నెల్లూరులోని స్నేహితుని ఇంటికి ఓ ఫంక్షన్‌ నిమిత్తం సొంత కారులో సొంత డ్రైవ్‌లో బయలుదేరారు. మార్గ మధ్యంలో యాక్సిడెంట్‌కి గురయ్యారు.

తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ మరణం సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రచారంలో చైతన్య రథం నడిపి, తండ్రికి అంగరక్షకుడిగా వెన్నంటి ఉన్నారు. సినిమాల్లో బాలనటుడిగా తెరంగేట్రం చేసి, పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. చివరిగా 'శ్రావణమాసం' సినిమాలో నటించిన హరికృష్ణ ఆ తర్వాత ముఖానికి రంగు వేసుకోలేదు. అప్పుడప్పుడూ కుమారులు కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ సినిమాల ఆడియో ఫంక్షన్స్‌లో కనిపించేవారు. హరికృష్ణ హఠాన్మరణంతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

మరిన్ని సినిమా కబుర్లు
This beauty is great