Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Then the sequel?

ఈ సంచికలో >> సినిమా >>

నటించనుగాక నటించనందట...

I don't want to ...

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది మామూలు సామెత....సక్సెస్ వచ్చినప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనేది సినీ జనాల సామెత. ఒకట్రెండు సినిమాలు హిట్టయ్యి, మార్కెట్ వస్తూనే అమాంతం పారితోషికాలు పెంచేయడం, అదే క్రమంలో కమర్షియల్ అడ్వర్టైజ్ మెంటలలో సైతం తళ్ళుక్కుమని కనిపించి కోట్లు తీసుకోవడం ఒక భాగం....షాపింగ్ మాల్స్ వాళ్ళూ రకరకాల కంపెనీల వాళ్ళూ సక్సెస్ లో ఉన్న హీరో హీరోయిన్లను తమ ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకోవడం మామూలే...

కానీ ఈ ట్రెండ్ కి విరుద్ధంగా ఫిదా ముద్దుగుమ్మ సాయిపల్లవి మాత్రం ఒక కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్ ఆఫర్ ని తిరస్కరించిందట...అదీ లక్షల ఆఫర్ కూడా కాదు  ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని....ఒక కంపెనీ వాళ్ళు అడిగితే తాను నటించనుగాక నటించనందట....ఎందుకని అడిగితే  ఈ ముద్దుగుమ్మ చెప్పిన కారణం కూడా వెరైటీగా ఉందట... అదేమంటే....ఎవరేసబ్బు వాడాలో...ఏ క్రీము రాసుకోవాలో...ఎవరిష్టం వాళ్ళది....ఫలానా సబ్బు వాడండీ...ఫలానా క్రీము రాసుకోండీ అని చెప్పడం నాకిష్టముండదు...అందట.....ఔరా ఏమి లాజిక్కు......

మరిన్ని సినిమా కబుర్లు
records... records...