Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Duggirala Gopalakrishnaiah

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (జూన్ 1 నుండి 7 వరకు) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


నా పూర్తి జాతక వివరాలు తెలుపగలరు - శివప్రసాద్, సికింద్రాబాద్
శివప్రసాద్ గారు మీరు ధనిస్టానక్షత్రం, కుంభరాశిలో జన్మించారు. ప్రస్తుతం శని మహార్దశ నడుస్తుంది. సోదర వర్గంనుండి మీకు సహకారం పెద్దగా లభించకపోవచ్చును. గత కొంత కాలంగా సుమారుగా ఒక సంవత్సర కాలంగా మాత్రువర్గం వారితో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు. 2014 ఆగష్టు నుండి బాగుంటుంది, ఆర్థికంగా లాభాలను పొందుతారు. నిదానంగా ఆలోచించి పనులను చేయండి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయుట మంచిది. చర్మసంబంధిత సమస్యలు లేదా రక్త పోటు బాధించుటకు అవకాశం కలదు సరైన నివారణ చర్యలు తీసుకోండి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండుటకు అవకాశం కలదు జాగ్రత్త. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనుట మేలుచేస్తుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. కాకపోతే వాటిని అమలు చేయడానికి అలసత్వం ఉంటుంది. సోదరవర్గం తో కూడా విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు నిదానంగా ఉండటం సూచన. ముందు నుండే తెల్సిన కుటుంబంలోని అమ్మాయినే వివాహం చేసుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో బాగా రానించగలరు. వ్యాపారంలో సంపాదన ఉంటుంది కానీ లాభం ఉండదు. దుర్గాదేవికి సోమ/మంగళ వారాలు పూజలు చేయుట, శివునకు శనివారాలు అభిషేకం చేయుట మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిబుధవారం సాయంత్రం విష్ణుసహస్ర నామం చదవడం మంచిది.

నా ఉద్యోగ అవకాశం గురించి చెప్పండి - మన్నేపల్లి ప్రమోద్ , ఆర్లపాడు, కృష్ణా జిల్లా
ప్రమోద్ మీరు సమయం సరిగా సమయాన్ని రాయనందుకు న్యుమరాలజీ ప్రకారం తెలుపుతున్నాను. మీరు నిదానంగా పనులను చేస్తారు.  కొంత బద్ధకం ఉంటుంది అంటే నచ్చిన పనులను ఒకలా నచ్చని పనులను మరొకలా చేస్తారు. విలాసవంతమైన జీవితం పట్ల ఇష్టాన్ని కలిగి ఉంటారు. మీయొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటారు. మిమ్మల్ని బాగా పొగిడితే పడిపోతారు లేదా బహుమతుల ద్వార మిమల్ని ఆకట్టుకోవచ్చును. వచ్చే సంవత్సరం బాగుటుంది.  ఈ సంవత్సరం జూలై తర్వాత ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు కలవు. 2014 తర్వాత మీరు చేపట్టిన పనులలో వేగం పెరుగుతుంది. మీరు ఎక్కువగా హనుమాన్ చాలీసా మరియు లక్ష్మీఅష్టోత్తరం చదవండి. ఖర్చులను అదుపులొఉంచుకొనుట మంచిది. 2013 నుండి ఆర్థికంగా బాగుంటుంది.

వుద్యోగం  మరియు భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పగలరు - వినీల చాందిని, సత్తుపల్లి
వినీల మీరు పూర్వాభద్ర నక్షత్రం కుంభరాశిలో జన్మించారు. మీమాటను నలుగురు వినాలన్న కోరికను కలిగి ఉంటారు. అధికమైన కోర్కెలను లేదా ఖర్చుపెట్టే స్వభావంను కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బాగున్నవి. విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. తప్పక విదేశాలకు వెళ్తారు ప్రయత్నం  చేయండి. ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తే విదేశీప్రయాణాలు జూన్ తర్వాత సనుకూలపడుతాయి. మొండితనం వదిలి పెద్దల సూచనలు పాటించుట మంచిది. 2013 జూలై మొదటి వారంలో ఉద్యోగం లభిస్తుంది. 2013 -2014 మొదట్లోనే అనగా మాఘంలో  వివాహం అయ్యే అవకాశం కలదు. వివాహం లో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు మిగితా అంతా బాగనే ఉంటుంది. ఎక్కువకాలం ఒకే పనిని చేయలేరు కొద్దిగా ఇబ్బందిగా భావిస్తారు. చుట్టపక్కల గుర్తింపును కలిగి ఉంటారు. ప్రతిరోజు తులసిమాతను పూజించుట, గురువారాలు శివాలయం లేదా సాయిబాబా దేవాలయం వెళ్ళుట మంచిది. ఆరోగ్య పరంగా సమస్యలు కలుగుటకు అవకాశం కలదు కావున సుబ్రమణ్య స్వామికి అభిషేకాలు మేలుచేస్తాయి.

నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనతో నాకు పెళ్లి అవుతుందా తెలుపగలరు - వీరభద్రం, తాడేపల్లి గూడెం
వీరభద్రం గారు మీరు మీ ఒక్క జన్మతేది వివారాలు మాత్రమే  ఇచ్చారు. మీయొక్క జీవితభాగస్వామిగా ఎవరిని అనుకుంటున్నారో వారి రాసిమాత్రమే ఇచ్చారు. ఈ మాత్రం సరిపోవు జనన వివారాలు కూడా కావాలి. మీరు మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినవారు. ప్రస్తుతం రాహు మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తుంది. మీకు ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నవి. వివాహజీవితం మాములుగానే ఉంటుంది ఎందుకంటే మీరు తొందరగా సంతృప్తి చెందే మనస్తత్వం కలిగిన వారు కాదు కాబట్టి. ప్రేమవివాహం అయ్యే అవకాశాలు కలవు కాని అప్పుడప్పుడు మీకు వివాదములు కలుగుటకు అవకాశం కలదు. అంటే ప్రస్తుతం మీయొక్క ప్రేమలో కూడా చిన్న చిన్న విభేదాలు తరచు కలుగుటకు అవకాశం కలదు. మీయొక్క మాట్లాడే విధానంలో దైర్యం లేకపోవడం లేదా కొంత సెటైర్స్ వేసే విధానం చేత నష్టపోయే అవకాశం కలదు మార్చుకోండి. వృషభారాశికి కర్కాటక రాశికి రాశ్యాదిపత్యం లేదు. అలాగని వివాహం కుదరదు అనిచెప్పలేము. ఇద్దరు జాతకం పూర్తిగా పరిశీలించ వలసి ఉంటుంది. ప్రస్తుతానికి దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించుకోండి. అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయండి మంచి జరుగుతుంది.

నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. నేను చాలా సమస్యలలో ఉన్నాను. నేనేమి చేయాలో చెప్పండి - వంశీ, అద్దంకి
వంశీ గారు మీరు పుష్యమి నక్షత్రం కర్కాటకరాశికి చెందిన వారు ప్రస్తుతం బుధమహర్దశ నడుస్తున్నది. ఏప్రిల్ 2014 వరకు బుధమహర్దశలో గురుఅంతర్దశ ఉన్నది. మీకు ఉద్యోగ అవకాశాలు బాగనే ఉన్నవి కాకపోతే కష్టపడడం మంచిది. గతంలో అంటే 2011 - 2012 ప్రాంతంలో మీరు అకారణంగా ఉద్యోగానికి వెళ్ళకపోవడం లేదా చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఉండాలి. 2013 జూలై తర్వాత ఉద్యోగఅవకాశాలు బాగున్నవి కాకపోతే సమయపాలన చేయడం మీ యొక్క మాట్లాడే విధానం సరిచేసుకోవడం మంచిది. ఆర్థికంగా సరైన ప్రణాలికను కలిగి ఉండుట మేలుచేస్తుంది ఇప్పటినుండి మరొక సంవత్సర కాలం ఖర్చులు కనభడుతున్నవి జాగ్రతగా ఉండండి. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుట భయపడుట మూలాన అవకాశాలు కోల్పోతున్నారు అనిచెప్పుకొవచ్చును. అలాగే సరైన కమ్యూనికేషన్ చేయడం వలన లాభంను పొందుతారు. బాగాకస్టపడితే 2013 సెప్టెంబర్ నుండి నవంబర్ లోపు తప్పక మంచి ఉద్యోగాన్ని పొందుటకు అవకాశం కలదు. తప్పక ప్రతిరోజు విష్ణుసహస్రనామం చదవండి అలాగే 1.25 kg ల పెసలు బుధవారం రోజున దానం ఇవ్వండి. అలాగే పేదవారికి(అవసరమైన వారికి) ఆకుకూరలు  దానం ఇవ్వండి. ఒక 7 మంగళవారాలు సుబ్రమణ్య స్వామి ఆలయం లేదా హనుమాన్ ఆలయం వెళ్ళండి 7 ప్రదక్షణలు చేయండి. ఒకగురువారం శివునకు పాలతో అభిషేకం చేసి 16 ప్రదక్షణలు చేయండి.

రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది - హేమగిరి, చిత్తూర్
హేమగిరి గారు మీరు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ప్రస్తుతం కేతువులో కేతు మహర్దశ నడుస్తుంది. జూలై 2013 నుండి కేతువులో బుధునిలొ శుక్రఅంతర్దశ రాబోతుంది. 2012 సంవత్సరం వరకు మీరు నిజానికి సరైన హార్డ్వర్క్ చేయలేదు లేదా సరైన విధానంలో వెళ్ళలేదు అని చెప్పుకోవచ్చును. సమయాన్ని చాలావరకు వృధాచేసారు. బద్దకాన్ని వీడండి. 2013 ఆగస్ట్ తర్వాత అవకాశాలు కలవు మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి కావాల్సిన ఆర్హతలను పెంచుకోండి. తప్పక ,మంచి ఉద్యోగం వస్తుంది. స్థిరమైన ఆలోచనలు చేయండి. మీరు వరుసగా 41 రోజులు గణపతి దేవాలయం వెళ్ళండి తెల్లని పూలతో పూజించండి. 7 బుధవారాలు గణపతికి బెల్లంను ప్రసాదంగా పెట్టి పూజించుట చేయండి. 6 ఆదివారాలు ఆదిత్యహృదయం చదవడం అలాగే ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయండి తప్పక మేలుజరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి మీకు అవకాశం ఊన్నప్పుడు గోసేవ చేయండి పచ్చగడ్డి తినిపించండి ఆర్థికంగా కూడా మీకు ఉన్న భాదలు తొలగుతాయి.  

 

వార ఫలాలు (జూన్ 1  - జూన్ 7)

 


మేష రాశి
ఈవారం అకారణంగా ప్రయాణాలు చేయవలసి రావోచ్చును మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. పనిభారం ఉండుట మూలాన సకాలంలో భోజనం చేయలేరు అలాగే చిన్న చిన్న కారణాలకే బంధువర్గంతో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు. వారం ప్రారంభంలో బంధువులతో సంతోశంగా గడిపినప్పటికిని చివరి వరకు అదే కొనసాగించలేకపోతారు. మానసికంగాదృడంగా ఉండటమనేది సూచన. మీ ఆలోచనల్లో కొంత ధననస్టాన్ని కలిగించే ఆలోచనలు ఉండే అవకాశం కలదు బాగాఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. మాటను పొదుపుగా వాడటం అందరిని కలుపుకొని వెళ్ళడం అనేది మేలైన భావన. ప్రయాణాలు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది సూచన. గాయములు అయ్యే అవకాశాలు కలవు. కుటుంభంలో కూడా మీయొక్క ఆలోచనలు పంచుకోండి ఎవరు మద్దతుఇవ్వకున్నను సర్దుబాటు విధానం ఆవలభించుట చేత ముందుకు వెళ్ళవచ్చును. వ్యాపారస్థులుమాత్రం క్రయవిక్రయముల మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు ఆ పరిచయాలు ఉయోగపడుతాయి. ఉద్యోగంలో మాత్రం నిదానంగా ఉండటమనేది సూచన. మీయొక్క వ్యతిరేకుల మిమల్ని ఇబ్బందిపెట్టే పనులను చేపడుతారు ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. విదేశీప్రయాణాలు లేదా దూరప్రదేశప్రయాణాలు అనుకూలిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలు పొందుట కోసం సుబ్రమణ్యస్వామికి అభిషేకం అలాగే దుర్గాఅష్టోత్తరం ప్రతిరోజు చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి
ఈవారం ఒకవిధంగా మంచిఫలితాలనే కలిగి ఉంటారు అనిచెప్పుకొవచ్చును.ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధువుల గురుంచి ఆలోచనలు చేస్తారు ఇష్టమైన పనులను చేపడుతారు. వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తగా ఉండటమనేది మంచిది. భోజనసౌఖ్యంను పొందుతారు బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు చేస్తారు తొందరపాటు లేకుండా నిదానంగా ముందుకు వెళ్ళుట మేలు. కొద్దిగా ఖర్చులను పొందు అవకాశం కలదు జాగ్రతగా ఉండటం మంచిది ఖర్చులను నియత్రించుట ఉత్తమం. వ్యాపారస్థులు నూతన భాగస్వా మ్యాలతో ముందుకు వెళ్తారు క్రయవిక్రయాలు బాగనే సాగుతాయి. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోనుట మూలాన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి చేపట్టే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండటమనేది సూచన. ధర్మసంభంద పనులలో పాల్గొంటారు ఆర్థికపరమైన ఆలోచనలు కలిగి ఉంది ఆదిశగా ముందుకు వెళ్తారు. కుటుంభంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. వస్త్రలాభంను పొందుటకు అవకాశం కలదు. నూతన గృహనిర్మాణం చేపట్టాలనే కోరిక బలపడుతుంది అలాగే స్థిరాస్తుల కోసం ప్రయత్నాలు ఆరంభిస్తారు. మంచిఫలితాల కోసం ఆదిత్యహృదయం పారయణ చేయుట అలాగే లక్ష్మీఅష్టోత్తరం చదవడం మంచిది.    

మిథున రాశి
ఈవారం ప్రయాణాలు చేయుట మూలాన అలసి పోతారు అదేవిధంగా ధనంను అదుపులో ఉంచుకోనుటలో విఫలం అయ్యే అవకాశం కలదు. ఆప్తబందువులకు లేక మీకు కావలసిన వారి ఆరోగ్యం ఆందోళనను కలిగించే అవకాశం కలదు. వారం ఆరంభంలో కుటుంభంలో కొంత అలజడిని పొందిన వెంటనే సర్దుకుంటారు. అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన ప్రయత్నాలలో విజయాన్ని సాదిస్తారు. ఇష్టమైన పనులను చేపడుతారు వాటిని సకాలంలో పూర్తిచేస్తారు.  బంధువుల యెడల అభిమానాన్ని కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికంగా సంచారం చేయుట మూలాన అలసిపోతారు కావున ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్దకూడదు. చంచల మనస్సును కలిగి ఉంటారు నిర్ణయాల్లో తడబాటు ఉంటుంది ఒకే నిర్ణయం పైన ఉండటంలో కాస్తా సందేహాలను కలిగి ఉండే అవకాశం కలదు. చేయువ్రుత్తిలో కొద్దిగా అసహనాన్ని కలిగి ఉండుటకు అవకాశం కలదు. పనిభారంను కలిగి ఉంటారు శ్రమతో పనులను పూర్తిచేస్తారు. అజాగ్రత్తగా ఉంటే ఆపదలు సంభవించుటకు అవకాశం కలదు. ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు నిదానంగానైనా ఫలితాలను రాబట్టుకుంటారు. కలహములను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండటం సూచన. మరిన్ని అనుకూలమైన ఫలితాలను పొందుటకు రుద్రాభిషేకం చేయుట శివారాధన మంచిది. ప్రతిరోజు గణపతిని ధ్యానం చేయుట ఉత్తమం. 

కర్కాటక రాశి
ఈవారం శుభకార్యక్రమాలలో చాలా వరకు సమయాన్ని గడుపుతారు. భోజనం విషయంలో ప్రత్యేకమైన ఇష్టాలను కలిగి ఉంటారు కాకపోతే మితంగా భుజించుట సూచన కారణం ఆరోగ్యవిషయంలో అశ్రద్ద చేయకండి తగిన పరిహరాలను పాటించుట మంచిది. కుటుంభంలో కలహములు కలుగుటకు అవకాశం కలదు సర్దుబాటు విధానంతో మనస్పర్థలు తొలిగే విధంగా పనిచేయుట ఉత్తమం. ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు అనుకున్న పనులను పూర్తిచేస్తారు. బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు భోజన సౌఖ్యాన్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయల్లో మీవిధానాలు లాభంను తెచ్చిపెడుతాయి ధనలాభంను పొందుతారు. ఉద్యోగంలో మాత్రం శ్రమను పొందుతారు అధికారులకు అనుకూలంగా ఉండటం సూచన. శత్రువుల ఆలోచనలు మే ముందు పనిచేయకపోవచ్చును. ధార్మికసంభందమైన పనులలో పాల్గొంటారు. విలువైన వస్తువులను మాత్రం జాగ్రత్తగా చుసుకోండి ఖర్చులు  పెరుగుటకు అవకాశం కలదు. చేయుపనిలో శ్రమ ఉంటుంది కష్టముంటుంది. అకారణంగా భయంను కలిగి ఉండుట చేత పనులను నిదానంగా కొనసాగిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం వేంకటేశ్వర ఆరాధన చేయుట లక్ష్మీగణపతికి అర్చన చేయుట మంచిది అలాగే ప్రతిరోజు దుర్గాఅష్టకం చదవండి.  

సింహ రాశి
ఈవారం ప్రతిపనిలోను శ్రద్ధను కలిగిఉండుట మేలుచేస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అనుకున్న పనులను చేయగలుగుతారు. తోటివారిలో మీపైన అసూయ పెరిగేఅవకాశం కలదు కావున జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో సరదాగా గడుపుటకు అవకాశం కలదు కొన్నివిషయాల్లో మాత్రం సర్దుబాటులు తప్పకపోవచ్చును. అధికారులతో అభినందనలు పొందుతారు కాకపోతే పనిని మాత్రం ఆలోచించి చేయండి తద్వారా మేలుజరుగుతుంది. వారం ఆరంభంలో సమాజంలో గుర్తింపును కోరుకుంటారు సంచారం చేయుట మూలాన అలసి పోవుటకు అవకాశం కలదు. కుటుంభంనుంచి పెద్దగా సహకారం రాకపోవచ్చును జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆహరం తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండటం మూలాన అనారోగ్య సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చును. నూతన ప్రయత్నాలు చేపడుతారు కొద్దిగా కష్టాన్ని పొందినను విజయవంతంగా కొనసాగిస్తారు చేపట్టిన పనిని. ఆర్థికపరమైన విషయల్లో బాగానే ఉంటుంది మీరు అశించిన స్థాయిని అందుకొనే అవకాశం కలదు సంతోషాన్ని పొందుతారు. ధార్మిక పనులను చేసే అవకాశం కలదు. మీ ఆలోచనల్లో మరింత పదును అవసరం. ఉత్తమ ఫలితాల కోసం విష్ణుసహస్ర నామం పారాయణ చేయుట,లక్ష్మీదేవిని ఆరాధించుట మంచిది.     

కన్యా రాశి
ఈవారం మిశ్రమఫలితాలను పొందుటకు అవకాశం కలదు అయినను ఒకింత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నూతన నిర్ణయాలు చేయకండి. అకారణంగా ఇంటా భయట కలహములు కలుగుటకు అవకాశం కలదు మీయొక్క మాటలను ఆలోచించి వాడుట మంచిది. వారం ఆరంభంలో ఉత్సాహంగా పనులను చేపడుతారు అందిరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేస్తారు,పనిలో ఉత్సాహం చివరివరకు ఉండకపోవచ్చును కావున ఇబ్బందులను పొందుతారు. తలకు మించిన భారంను మోయవద్దు. ఆహారం విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో అశ్రద్ద పనికి రాదు. మీరున్న ప్రదేశంనుండి మరొక ప్రదేశంకు వెళ్ళు అవకాశాలు కలవు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు నూతన పనులను మాత్రం ఆరంభించుట మంచిది కాదు. ఆచారవ్యవహారముల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. భోజనం పైన ప్రత్యెక శ్రద్ధను చూపిస్తారు కాకపోతే జాగ్రత్త. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుతారు. వ్యతిరేకులమూలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. చేసే పనుల పట్ల పూర్తిఅవగాహన కలిగి ఉండుట మంచిది. ఉద్యోగులు మాత్రం సర్దుకు పొండి. వృత్తిలో మాత్రం కొంత ఇబ్బందులను పొందుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి దానిమూలాన మేలుజరుగుతుంది కలహములు తగ్గుతాయి. మంచిఫలితాల కోసం లలితాసహస్ర నామం పారయణ చేయుట అలాగే హనుమాన్ ఆరాధన చేయండి మేలుజరుగుతుంది.   

తులా రాశి
ఈవారం మీరు తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. చేపట్టే పనిలో భారంను శ్రమను పొందుటకు అవకాశం కలదు. మిమల్ని వ్యతిరేకించే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుటకు అవకాశం కలదు. మీకునచ్చని వార్తలను వింటారు. వారం ఆరంభంలో ఎదురుదెబ్బలు తింటారు అయినను వారం మధ్యలో ఉత్సాహంతో పనిచేసి పనులను పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట మంచి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. మాటలను పొదుపుగా వాడండి నమ్మిన వారిచే మోసపోయే అవకాశం కలదు జాగ్రత్త. వాహనముల విషయంలో నిదానంగా ఉండండి అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట మేలు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. మీయొక్క ఆలోచనల్లో కటినత్వం ఉండుటకు అవకాశం కలదు మే వలన ఇతరులు ఇబ్బంది పడుతారు. ఆర్థికపరమైన విషయాలపైన శ్రద్ధను కలిగి ఉంటారు కాకపోతే నిదానంగా ఉండటం కలిసి వస్తుంది. పెద్దలయెడల గౌరవాన్నికలిగి ఉండుట మంచిది వారి మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. మీరుతీసుకొనే నిర్ణయాలు అపకీర్తిని కలిగిస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షణలు చేయండి, శివునకు అభిషేకం అలాగే శనికి తిలాఅభిషేకం మంచిది.

వృశ్చిక రాశి
ఈ వారం ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినను తొలగిపోవుటకు అవకాశం కలదు. మీయొక్క ఆలోచనలను మాత్రం అదుపులో ఉంచుకొనుట మేలుచేస్తుంది లేకపోతే కలహములు కలుగుటకు అవకాశం కలదు. చేపట్టే పనిలో ఉత్సాహంను కోల్పోతారు స్వల్ప ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. మానసిక ఆందోళనను పొందుతారు ఒకవార్త మీలో నిరుత్సాహంను పొంచుతుంది తట్టుకొనే ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంభంలోని సభ్యులతో సంతోషంగా గడుపుతారు విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం కలదు. సేవాగునాన్ని కలిగి ఉండటం మేలుచేస్తుంది ఆదిశగా అడుగులు వేయండి. అర్థికపరమైన విషయాల్లో వారం చివర్లో రాణిస్తారు ధనలాభంను పొందుతారు బాగుంటుంది. ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండండి ఇతరుల ఆలోచనలు పాటించుట చేత సమస్యలు కొనితెచ్చుకున్న వారు అవుతారు. మీ ప్రవర్తన సరిగా ఉండక పోవుట అనేది ఇబ్బందికరమైన విషయం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట ఉత్తమం. ఉద్యోగంలో కూడా పెద్దగా అనుకూలంగా ఉండకపోవచ్చును అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. విందులు వినోదముల పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని కనభరుస్తారు. మరిన్ని ఫలితాల కోసం దుర్గాదేవికి పూజలు చేయుట,ప్రతిరోజు అస్టోత్తరం చదువుట మంచిది.      

ధనస్సు రాశి
ఈవారం బాగుంటుంది కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండటం అనేది సూచన. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో బాగనేఉంటుంది నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయల్లో ముందుకు వెళ్తారు ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో నూతన పనులను చేపడుతారు కాకపోతే మానసికంగా ఆందోళనలు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండటం సూచన. పనులలో ఇతరుల మూలాన ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రతగా ఆచితూచి వ్యవహరించుట చేయండి. కుటుంభసభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన ఆలోచనలు చేస్తారు ముందుకు వెళ్తారు. నూతనవస్త్రప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. సేవాగుణాన్ని కలిగి ఉండుట చేత తోటివారు మీ ఆలోచనల మూలాన లాభంను పొందుతారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం సూచన ఉద్యోగంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రాజకీయ వ్యవహరాల పట్ల ఆసక్తిని కనభరుస్తారు. ఇష్టమైన పనుల్లో ముందు ఉంటారు. కోపాన్ని తగ్గించుకొనుట మేలు,కలహములకు దూరంగా ఉండటం సూచన. ప్రయత్నాల్లో మాత్రం శ్రమను పొందుతారు సేవాకావృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కటి ఫలితాల కోసం రాఘవేంద్రస్వామిని ఆరాదించుట సాయిబాబా ఆలయం సందర్సించుట చేయండి.   

మకర రాశి
ఈవారం ప్రతికూల ఫలితాలు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్నను ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులలో అనుకోకుండా ఖర్చులు వచ్చుటకు అవకాశం కలదు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతారు కావున పెద్దల సూచనలు పాటించుట మంచిది. అనారోగ్యపరంగా సమస్యలను పొందుతారు జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఆశుభవార్తను వినే అవకాశం కలదు మనోవిచారంను పొందుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిది అల్పభోజనం చేయుటకు అవకాశం కలదు. తోటివారు  మీ యొక్క ఆలోచనలను వ్యతిరేకిస్తారు. చర్చలలో పాల్గొంటారు విధ్యాసంభందమైన విషయాల్లో పాల్గొంటారు. అధికారుల వలన పనిభారంను పొందుటకు అవకాశం కలదు మీకు ఉద్యోగంలో సంతృప్తి ఉండకపోవచ్చును. సర్దుబాటు విధానంతో ముందుకు వెళ్ళుట అన్నివిధాల మేలుజరుగుతుంది. కుటుంభంలో సమస్యలు పొందుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట సూచన. వారి మూలాన శ్రమను కలిగి ఉంటారు. పాపసంభంద విషయాలలో పాల్గొంటారు అనుకోని ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. మంచి ఫలితాల కోసం గణపతికి అభిషేకం అలాగే సుబ్రమణ్య ఆరధన మేలుచేస్తుంది.     

కుంభ రాశి
ఈవారం ఆర్థికంగా బాగానే ఉంటుంది ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చును చేపట్టకపోవడం మంచిది. అనుకున్న పనులను నిదానంగా పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. కుటుంభంలో మీరు ఆశించిన స్థాయిలో మార్పు కనబడకపోవచ్చును సర్దుకుపోవడం సూచన. మాటలను పొదుపుగా వాడుట మంచిది. ఉత్సాహంను కలిగి ఉండి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు మొదట్లో ఇబ్బందులు కలిగినను ప్రయత్నం మాత్రం ముందుకు సాగుటకు అవకాశం కలదు. కొంతమేర మానసిక ఆందోళనను పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రుల సూచనలు నచ్చకపోవచ్చును కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. అనారోగ్య విషయంలో అశ్రద్ద చేయకండి శ్రమను పొందుటకు అవకాశం కలదు. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం  కలదు కావున జాగ్రత్తగా ఉండటం సూచన. ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పులు వచ్చుటకు అవకాశం కలదు ఉద్యోగంలో అభివృద్దికి ప్రయత్నం మొదలు పెడుతారు. భోజనం సమయానికి తీసుకుంటారు భోజనసౌఖ్యం ఉంటుంది. ఇష్టమైన పనులను చేపడుతారు. వివిధరూపములుగా పనిచేయుట మూలాన అలసి పోతారు శ్రమను పొందుటకు అవకాశం కలదు.

మీన రాశి
ఈవారం బాగానే ఉంటుంది. బంధువులతో మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు అనుకున్న పనులను ముందుకు తీసుకు పోగలరు. సంతానమూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. శరీరసౌఖ్యంను పొందుటకు ఇస్టపడుతారు ఆర్థికంగా లాభాలను పొందుటకు అవకాశం కలదు. నూతన పనులను చేపట్టుటకు ఉత్సాహంను కలిగి ఉంటారు అదేసమయంలో విపరీతమైన ఆలోచనలు కలిగి ఉండుట చేత మానసికంగా సంశయంలో ఉంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోకపోవడం మంచిది. ఇష్టమైన పనులను ఆరంభిస్తారు నూతన వస్త్రప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. ధనధాన్యసంవ్రుద్దిని కలిగి ఉంటారు స్థిరమైన ఆలోచనలు చేయుట మంచిది పెద్దల సూచనలు పాటించుట మంచిది. స్థానచలనం కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండటం సూచన. నూతన పరిచయాలు కలుగుతాయి పెద్దల పరిచయాలు అనుకూలిస్తాయి. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. మంచి ఆలోచనలు చేస్తారు మీ శ్రేయోభిలాషులు లేదా మిత్రుల సలహాలను పాటించుట చేత మేలుజరుగుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు కొద్దిగా శ్రమను పొందుటకు అవకాశం కలదు. మంచిఫలితాల కోసం ఆంజనేయ స్వామికి ఆకుపూజ అలాగే గణపతి ధ్యానం చేయండి మంచిది.   

మరిన్ని శీర్షికలు
annamayya pada seva