Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie review - patas

ఈ సంచికలో >> సినిమా >>

నిజంగా నేను అంత అందంగా ఉంటానా??

Interview with Amy Jackson

అమ్మో.. అనిపించేంత అందం అమీజాక్స‌న్‌ది. విదేశీ స‌రుకు క‌దా.. చూడ‌గానే మ‌న‌వాళ్ల‌కు బాగా న‌చ్చేసింది. ముందు త‌మిళ తంబీల దృష్టి ఆక‌ర్షించింది. ఆ త‌ర‌వాత తెలుగులోనూ మెప్పించింది. ఎవ‌డుతో ఆమెకు క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కింది. ఇప్పుడు `ఐ`తో టోట‌ల్‌గా సౌత్ ఇండియానే ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సినిమాలో మోడ‌ల్ దివ్య పాత్ర‌లో రాణించింది. అస‌లే మోడ‌ల్ పాత్ర‌.. అందుకే - గ్లామ‌ర్ విష‌యంలో ఏమాత్రం లోటు చేయ‌కుండా వేడి వేడి అందాల్ని కొస‌రి కొస‌రి వ‌డ్డించింది. `ఐ` ఫ‌లితం ఎలా ఉన్నా.. అమీ క‌ష్టం వృథా పోలేదు. చాలామంది ద‌ర్శ‌కుల దృష్టిలో అమీ ప‌డింది. ఆమెకు కొత్త అవ‌కాశాలొస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా అమీజాక్స‌న్‌తో ముచ్చ‌టించింది గో తెలుగు.

* `ఐ`ని వెండి తెర‌పై చూసుకొంటున్న‌ప్పుడు మీ మొద‌టి ఫీలింగ్ ఏమిటి?
- వావ్‌... ఇట్స్ వండ‌ర్‌..!  నిజంగా నాకు అలానే అనిపించింది. శంక‌ర్ అద్భుత‌మైన ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం `ఐ`.

* ఈ సినిమా జ‌నం మ‌ధ్య‌ థియేట‌ర్లో చూశారా?
- యస్‌.. ఇప్ప‌టికే మూడు సార్లుచూశా. వాళ్ల స్పంద‌న ఎంతో కిక్ ఇచ్చింది.

* ఈసినిమాని చూసిన మీ స‌న్నిహితులు మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు?
- `ఐ` ఓ విజువ‌ల్ వండ‌ర్ అంటున్నారు. విక్ర‌మ్ గెట‌ప్పుల గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్నారు. నిజంగా.. విక్ర‌మ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మూడు ర‌కాల గెటప్పుల్లో అత‌ను అద్భుతంగా ఇమిడిపోయాడు.

* విక్ర‌మ్‌ని కురూపిగా చూసిన‌ప్పుడు మీకు ఏమ‌నిపించింది?
- మొద‌ట్లో చాలా భ‌య‌ప‌డ్డా. ఆ త‌ర‌వాత‌.. అల‌వాటు చేసుకొన్నా. కానీ ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను.. ఆ పాత్ర విక్రమ్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ చేయ‌లేర‌న్నంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడు.  ఓ పాత్ర కోసం, ఓ సినిమా కోసం మనుషులు అంతగా శ్ర‌మిస్తారా అనిపించింది. ప్రొఫెష‌న‌లిజానికి అద్దం ప‌ట్టింది విక్ర‌మ్ న‌ట‌న‌.

* మోడ‌ల్ పాత్ర‌లో మీరూ బాగానే ఇమిడిపోయారు క‌దా...?
- (న‌వ్వుతూ) ఇది వ‌ర‌కు మోడ‌ల్ నే క‌దా. అందుకే ఆ అనుభ‌వం బాగా ఉప‌యోగ‌ప‌డింది.

* అమీ ఇదివర‌క‌టి సినిమాల‌కంటే అందంగా ఉంది అంటున్నారు...
- ఆ క్రెటిట్ మాత్రం నిజంగా పిసీ శ్రీ‌రామ్ సార్‌దే. న‌న్ను చాలా అద్భుతంగా చూపించారాయ‌న‌. నిజంగా పీసీ శ్రీ‌రామ్ లాంటి గొప్ప కెమెరామెన్‌తో ప‌నిచేయ‌డం నా అదృష్టం. ఆయ‌న న‌న్ను చాలా చాలా అందంగా చూపించారు. తెర‌పై న‌న్ను నేను చూసుకొంటే న‌మ్మ‌లేక‌పోయా. నిజంగా నేను అంత అందంగా ఉంటానా అనిపించింది.

* మీ గ్లామ‌ర్‌కి పీసీ సార్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు..
- య‌స్‌... అది నాకు ఆస్కార్ అవార్డుతో స‌మానం. ఏ క‌థానాయిక‌కైనా ఆయ‌న కెమెరా ఫ్రేమ‌లో ఇమిడిపోవాల‌ని ఉంటుంది. ఆ అదృష్టం నాకు ఇంత తొంద‌ర‌గా ద‌క్క‌తుంద‌ని అనుకోలేదు.

* కేవ‌లం ఈ ఒక్క సినిమా కోసం.. రెండేళ్ల మీ కాల్షీట్ల‌ను కేటాయించారు. కొన్ని సినిమాల్ని వ‌దులుకొన్నారు. అంత న‌మ్మ‌కం ఏంటి ఈ సినిమాపై?
- శంక‌ర్‌, పీసీ శ్రీ‌రామ్, రెహ‌మాన్‌.. ఈ కాంబినేష‌నే నాకు అద్భుతంగా అనిపించింది. ఇలాంటి క‌ల‌యిక‌లో ఓ సినిమా చేస్తాన‌ని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి అవ‌కాశం వ‌స్తే ఎందుకు వ‌దులుకోవాలి??  అందుకే నేను మ‌రో విష‌యాన్ని ఆలోచించలేదు. ఈ రెండేళ్ల‌కాలంలో కొన్ని సినిమాల్ని వ‌దులుకొన్న మాట వాస్త‌వ‌మే. అయితే అవేం... `ఐ`కంటే ఎక్కువ కాదు.

* తెలుగులో `ఎవ‌డు` త‌ర‌వాత మ‌రో సినిమా చేయ‌లేదు..
- ఎవడు నాకు మంచి క‌మ‌ర్షియ‌ల్ గుర్తింపు తెచ్చింది. ఆ త‌ర‌వాత చాలా క‌థ‌లు విన్నా. కానీ `ఐ` వ‌ల్ల ఒప్పుకోలేక‌పోయా. ఇప్పుడు నేను తెలుగు సినిమాలు చేయ‌డానికి రెడీ.

* క‌థానాయిక‌గా మీకంటూ ఏమైనా ప్రాధాన్యాలున్నాయా?
- నెల‌, రెండు నెల‌లు, సంవ‌త్స‌రం.. ఇలా ఓ సినిమా కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తాను. కానీ... ఆ సినిమాలో, ముఖ్యంగా నా పాత్ర‌లో విష‌యం ఉంది అనుకొన్న‌ప్పుడు క‌ష్ట‌ప‌డ‌డంలో త‌ప్పులేదు. క‌థ చెబుతున్నప్పుడు `ఈ సినిమాఎలాగైనా చేయాల్సిందే` అనిపించాలి. అప్పుడు త‌ప్ప‌కుండా ఒప్పుకొంటా.

* స్టార్ హీరోల‌తోనే చేయాలి అనే రూల్ ఏమైనా ఉందా?
- అదేం లేదు. క‌థ న‌చ్చాలి అంతే. స్టార్ హీరోల‌తోనేచేస్తా అనే నిబంధ‌న విధించుకొంటే.. చాలా మంచి క‌థ‌లు మిస్ అవుతా.

* మంచి క‌థ‌లు మిస్ చేసుకొన్న సంద‌ర్భాలున్నాయా?
- ఉన్నాయి. కొన్ని కార‌ణాల వ‌ల్ల కొన్ని సినిమాల్ని వ‌దులుకొన్నా. కానీ... వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోను.

* మీ బ‌లం... మీ గ్లామ‌రేనా..?
- అమీ అందంగా ఉంటుంది అనే మాట నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. కానీ.. బాగా న‌టిస్తుంద‌న్న కాంప్లిమెంట్ కూడా ఉంటేనే ఇండ్ర‌స్ట్రీలో నిల‌బ‌డ‌గ‌లం. ఇవి రెండూ ఉంటేనే.. గుర్తింపు.

* ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలేంటి?
- క‌థ‌లు విన్నా. కానీ ఇంకా ఆ ప్రాజెక్టులేం ఓ కొలిక్కి రాలేదు. ఒప్పుకొన్న వెంట‌నే చెప్తా.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka