Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Trisha Husband

ఈ సంచికలో >> సినిమా >>

త్రివిక్రమ్‌ ఇంకో ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌

Intresting title from Trivikram Srinivas

‘అత్తారింటికి దారేది’ అంటూ సాఫ్ట్‌ టైటిల్‌తో పవన్‌కళ్యాణ్‌తో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకి ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ అనే టైటిల్‌ పెట్టాడట. టైటిల్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా, వెరైటీగానూ ఉంది. చాలా టైటిల్స్‌ని పరిశీలించి, చివరకు ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

అల్లు అర్జున్‌కి కూడా ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ టైటిల్‌ బాగా నచ్చిందట. ‘జాదూగర్‌’, ‘హుషారు’, వంటి టైటిల్స్‌ ఈ సినిమా నిర్మాణ సమయంలో ఇప్పటిదాకా వినిపించాయి. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గతంలో ‘జులాయి’ సినిమా తెరకెక్కించగా, అది పెద్ద హిట్‌ అయ్యింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో అప్పటిదాకా అతి పెద్ద సక్సెస్‌ ఆ మూవీ.

లాస్ట్‌ ఇయర్‌, అంటే 2014లో అతి పెద్ద హిట్‌ కొట్టాడు అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’ సినిమాతో. అంతకు ముందు సంవత్సరం సూపర్‌ హిట్‌ సినిమా ‘అత్తారింటికి దారేది’కి డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. 2015లో రానున్న ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ సినిమా ఎలాంటి సంచనాలనకు వేదికవుతుందో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
Good News to Bahubali fans