Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
can bunny hits more 50

ఈ సంచికలో >> సినిమా >>

‘బాహుబలి’ని పొగడాలంటే మాటలు చాలవు

no words on bahubali..

పొగిడేందుకు మాటలు సరిపోవడంలేదు. ఓ సినిమాకి ఇంతకన్నా గొప్ప పొగడ్త ఇంకేమీ ఉండకపోవచ్చు. ఆ సినిమా ‘బాహుబలి’. యస్‌, సినిమా ట్రైలర్‌ ఎవరు చూసినా అందరిదీ ఒకటే మాట. అద్భుతం అన్న ఒక్క మాటతో సరిపెట్టలేమని, ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. అందమైన లొకేషన్స్‌ని గ్రాఫిక్స్‌లో సృష్టించిన రాజమౌళి, యుద్ధరంగాన్ని వేలాదిమందితో నింపేసి హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీని తలపించాడు. ఇది తెలుగు సినిమా కానే కాదు, హాలీవుడ్‌ సినిమాలా ఉందని బాలీవుడ్‌ ప్రముఖులూ ‘బాహుబలి’పై ప్రశంసలు కురిపించారు. రెండు విభిన్న పాత్రల్లో ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు.

వచ్చిన ట్రైలర్‌ ఫస్ట్‌ పార్ట్‌దే. దానికోసమే ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ఆడియన్స్‌. సినిమా వచ్చేస్తే, ఆ అద్భుతాన్ని ఆడియన్స్‌ తెరపై చూసేస్తే, రెండో పార్ట్‌ కోసం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగలేరనేంతలా ట్రైలర్‌తోనే సంకేతాలు పంపేశాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పటిదాకా ‘మగధీర’ అద్భుతం తెలుగు తెరపై. దాన్ని మించిన ‘అద్భుతం’ కానుంది ‘బాహుబలి’ అనడం అతిశయోక్తి కానే కాదు.
 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam