Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
compare with heros

ఈ సంచికలో >> సినిమా >>

'సర్దార్‌'కి పవన్‌ మెగా ఫోన్‌

sardar has mega phone


సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'గబ్బర్‌ సింగ్‌ 2' బాబీ చేతిలోకి వచ్చిపడింది. ఈ సినిమా టైటిల్‌ కూడా మారింది. 'గబ్బర్‌సింగ్‌'కి సీక్వెల్‌ అయినా 'సర్దార్‌' అనే పేరు పెట్టారు. అయితే బాబీ కాకుండా పవన్‌కళ్యాణ్‌ సెట్‌లో మెగాఫోన్‌ పట్టుకుని కనిపిస్తున్నాడట. 'జానీ' చిత్రం పవన్‌కళ్యాణ్‌ దర్శకత్వంలోనే వచ్చింది. ఆ ప్రయత్నం మళ్ళీ చేయడంలేదుగానీ 'సర్దార్‌' సినిమా కోసం యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని పవన్‌కళ్యాణ్‌ స్వయంగా డిజైన్‌ చేసుకున్నాడట. యాక్షన్‌ సీన్స్‌ వరకూ డైరెక్షన్‌ చేస్తున్న పవన్‌, దర్శకత్వ బాధ్యతలు మాత్రం పూర్తిగా బాబీ చేతుల్లోనే పెట్టాడట. పవన్‌కళ్యాణ్‌ తన సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసుకోవడం కొత్త కాదు. కానీ కొన్నాళ్ళ నుంచి దానికీ దూరంగా ఉన్నాడు. 'సర్దార్‌'తో తనలోని యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ని పవన్‌ బయటపెట్టాడంటున్నారు. 'గబ్బర్‌సింగ్‌', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో తన సినిమాపై అంచనాలు పెరిగిపోవడంతో 'సర్దార్‌' విషయంలో పవన్‌ ఎక్కడా రాజీ పడటంలేదట. అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నానని చెప్పిన పవన్‌, అభిమానుల అంచనాల్ని అందుకోవడానికే ఫైట్స్‌ విషయంలో కూడా ఇలా కష్టపడుతున్నాడనుకోవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
rana concentrate leader2