Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

దేశంలోని అత్యుత్త‌మ న‌టుల్లో మ‌హేష్ ఒక‌డు -  కొర‌టాల శివ‌

క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల్ని తొలి సినిమాలోనే ఒంట‌బ‌ట్టించుకొన్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. క‌థ విష‌యంలో ప్ర‌యోగాలు చేయ‌కుండా ఫ‌క్తు ఫార్ములా క‌థ‌ని ఎంచుకొని... మాస్‌కి ఏ లోటూ రాని స‌న్నివేశాల్ని రాసుకొని - గ‌న్‌షాట్ హిట్ కొట్టేశాడు. తొలి సినిమాకే సూప‌ర్ హిట్ అందుకొని.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నుంచి పిలుపు అందుకొన్నాడు. ఇప్పుడు మ‌హేష్‌ని శ్రీ‌మంతుడుగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈసంద‌ర్భంగా కొర‌టాల తో్ చిట్ చాట్ ఇది.

* శ్రీ‌మంతుడు విడుద‌ల కాబోతోంది.. పెద్ద స్టార్‌, పెద్ద కాన్వాస్‌... ఒత్తిడి కూడా అదే రేంజులో ఉందా?
- మిర్చి త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది. రెండో సినిమా ఇంకా బాగా తీయాల‌న్న త‌ప‌న ఉంటుంది. దాంతో టెన్ష‌నూ పెర‌గ‌డం కామ‌న్‌. అయితే ఆ టెన్ష‌న్‌ని స్ర్కిప్టు ద‌శ‌లోనే వ‌దిలేశా. క‌థ సిద్ధ‌మ‌య్యాక టెన్ష‌న్ ఎగిరిపోయింది. మ‌హేష్ బాబు సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్స్ తో పాటు, స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అన‌ద‌గ్గ పాయింట్ త‌ప్ప‌కుండా ఉండాలి. అది.. శ్రీ‌మంతుడుకు స‌రిగ్గా కుదిరింది. మ‌హేష్ కూడా ఈ క‌థ విన‌గానే ఓ కొత్త క‌థ‌ని ఇలాక్కూడా చెప్పొచ్చా... అని ఆశ్చ‌ర్య‌పోయారు.

* ఆ కొత్త పాయింట్ ఏంటి?
- అది చెప్ప‌కూడదు. తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

* ఊరి ద‌త్త‌త అనే పాయింట్‌తో అల్లిన క‌థ అని ట్రైల‌ర్‌లోనే అర్థ‌మ‌వుతోంది.. అయితే ఆ పాయింట్‌తో క‌థ రాసుకోవ‌డానికి మీకు స్ఫూర్తినిచ్చిన విష‌యం ఏమిటి?
- తిరిగి ఇవ్వ‌డం అన్న‌ది గొప్ప సంప్ర‌దాయం. ఊర్లో చ‌దువుకొని విదేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డిన ఎన్నారైలు- తిరిగి త‌మ ఊరికి ఎంతో కొంత సేవ చేస్తున్నారు. ఫ‌లానా ఎన్నారై ఊర్లో ఆసుప‌త్రి క‌ట్టించాడ‌నో, స్కూలు క‌ట్టించాడ‌నో చెప్తుంటే అంత‌కంటే హీరోయిజం ఏముంది?  అనిపిస్తోంది.
నా క‌థ‌కు స్ఫూర్తి అక్క‌డిదే అనుకోవాలి.

* మ‌హేష్ తో జ‌ర్నీ ఎలా అనిపించింది?
- నిజంగా థ్రిల్ ఫీల‌య్యా. ఇలా చెప్తే.... కామ‌న్ ఆన్స‌ర్‌లానే ఉంటుంది కానీ, త‌ప్ప‌దు. నిజంగానే త‌ను ఓ గొప్ప స్టార్‌. మేం చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేశాం. ఆరు నెల‌ల్లో సినిమా అయిపోయింది. ఇంకో ఆరు నెల‌లు షూటింగ్ ఉంటే బాగుండేది అనిపించింది.

* స్టార్‌గా, న‌టుడిగా మ‌హేష్‌ని వివ‌రించ‌మంటే..
- తాను సూప‌ర్ స్టార్ అయ్యాడంటే అది ఒక్క సినిమాతో కాదు. ఎన్నో సినిమాల నుంచి మ‌హేష్‌ని చూస్తున్నాం. అత‌నికి వ‌చ్చిన నంది అవార్డులే చెప్తాయి మ‌హేష్ అంటే ఏమిట‌న్న‌ది. ఇండియాలోని అత్యుత్త‌మ న‌టుల్లో మ‌హేష్ ఒక‌రు.

* మ‌హేష్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత వ‌ర‌కూ ఉంది?
- క‌థ విన‌గానే ఆయ‌న `ఈ క‌థ చెప్పింది చెప్పిన‌ట్టు తీయండి చాలు సూప‌ర్ హిట్ట‌యిపోతుంది` అన్నారు. అంత‌కు మించి ఏం చెప్ప‌లేదు.  అయితే ఓ సీన్ బాగా రావ‌డానికి ఆయ‌న ప‌డే తాప‌త్ర‌యం అంతా ఇంతా కాదు. అంతా ప‌ర్ ఫెక్ట్ అని నేను అనుకొన్నా... ఆయ‌నే వ‌న్‌మోర్ చేద్దామంటుంటారు. అంత పెర్‌ఫెక్ష‌నిస్ట్ ఆయ‌న‌.

* తొలి సినిమా మిర్చికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్‌నే దాదాపుగా ఈ సినిమాకీ కొన‌సాగించారు. ప్ర‌త్యేక‌మైన కార‌ణాలున్నాయా?
- కెమెరా మ‌ది, సంగీతం దేవిశ్రీ‌, పాట‌లు రామ‌జోగ‌య్య‌... ఇలా మిర్చికి ప‌నిచేసిన వాళ్ల‌లో చాలామంది ఈసినిమాకీ ప‌నిచేశారు. ఎందుకంటే.. వాళ్ల‌తోనాకు ట్యూన్ అంత బాగా కుదిరింది. నా టెక్నీషియ‌న్లు సినిమా ఇంకా బెట‌ర్‌గా రావ‌డానికి సూచ‌న‌లు ఇవ్వాలి. వాళ్ల‌కు డ‌బ్బులిచ్చి పెట్టుకొనేది అందుకేగా?  సెట్లో నాకు చాలా ప‌నులుంటాయి. లొకేష‌న్ చూసుకోవాలి, సీను వివ‌రించాలి, క‌ల‌ర్ కాంబినేష‌న్ చూసుకోవాలి... ఇన్ని చూసుకొని ఫ్రేమ్ కూడా నేనే ఫిక్స్ చేయాలా?  ఈ ప‌ని మ‌ది చూసుకొంటాడు. ఇక దేవిశ్రీ అయితే క‌థ‌తో ట్రావెల్ చేస్తుంటాడు. పాటంటే దేవికి ప్రాణం. త‌న పాట‌ని కాపాడుకోవ‌డానికి ఏంచేయాలో అన్నీ చేస్తాడు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి స‌న్నివేశానికి త‌గిన ప‌దాల‌తో... ఆ పాట‌కు ప్రాణం పోస్తారు. అందుకే... వీళ్ల‌ని ఈ సినిమాలోనూ కొన‌సాగించాను. వాళ్లిచ్చిన అవుట్‌పుట్స్ అమేజింగ్‌.

* ఈ సినిమాతో మ‌హేష్ నిర్మాణంలోనూ భాగం పంచుకొన్నారు క‌దా..?
- ఈ క‌థ మ‌హేష్‌కి అంత న‌చ్చింది. ఒక ద‌శ‌లో సోలోగా ఈ సినిమాని తీద్దామ‌నుకొన్నారాయ‌న‌.

* మిర్చి త‌ర‌వాత చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల్సింది. చ‌ర‌ణ్ కోసం రాసుకొన్న క‌థ ఇదేనా..?
- కాదు. ఇది కేవ‌లం మ‌హేష్ కోసం రాసుకొన్న క‌థ‌. అంత‌కు ముందు లైన్ మాత్ర‌మే ఉండేది. మ‌హేష్ అని ఫిక్స‌య్యాక త‌న కోసం క‌థ‌ని మ‌రింత డ‌వ‌ల‌ప్ చేసుకొన్నా.

* ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు....తొలి అడుగుల్లోనే పెద్ద హీరోల‌తో ప‌నిచేసే ఆఫ‌ర్లు అందుకొన్నారు. ఏం మ్యాజిక్ చేశారేంటి?
- మ్యాజిక్ చేసింది నేను కాదు, క‌థే. మంచి క‌థ‌తో వెళ్తే స్టార్ల‌తో సినిమా చేయ‌డం సుల‌భ‌మే. వినాయ‌క్‌, పూరి జ‌గ‌న్నాథ్‌, రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీ‌ను... ఈ ద‌ర్శ‌కులంతా తొలి అడుగుల్లోనే పెద్ద హీరోల‌తో సినిమాలు చేశారు క‌దా.

* మ‌రి చిన్న సినిమాలూ, చిన్న హీరోల జోలికి వెళ్ల‌రా..
- అది క‌థ‌ని బ‌ట్టే ఉంటుంది. సీతాకోక‌చిలుక‌లాంటి క‌థ దొరికితే, ఖ‌చ్చితంగా కొత్త వాళ్ల‌తోనే తీయాలి క‌దా.

* ద‌ర్శ‌కుడిగా మీ శైలి ఏంటి?
- నా దృష్టిలో ద‌ర్శ‌కుడి కంటే క‌థే ఓ శైలి ఉంటుంద‌ని న‌మ్ముతా. ఈ విష‌యంలో నాకు జంథ్యాల‌గారే ఆద‌ర్శం. అహ‌నా పెళ్లంట‌, చంట‌బ్బాయ్ సినిమాలు తీసిన ఆయ‌న‌... శంక‌రాభ‌ర‌ణం సినిమాకీ మాట‌లు రాశారంటే న‌మ్మ‌బుద్ది కాదు. అహ‌నా పెళ్లంట జంథ్యాల స్టైల్‌.. కానీ శంక‌రాభ‌ర‌ణం కాదు. క‌థ‌ని బ‌ట్టి స్టైల్ మారుతుంది.

* శ్రీ‌మంతుడు షూటింగ్ స‌మ‌యంలో మీరు బాగా ఇబ్బంది ప‌డిన విష‌య‌మేంటి?
- హీరో ఇంటిని వెదికి ప‌ట్టుకోవ‌డం క‌ష్టం. ధ‌న‌వంతుల ఇల్లు మ‌నం చాలాచూశాం. కానీ ఇది శ్రీ‌మంతుడు ఇల్లు. ఇంకా క్లాస్‌గా ఉండాలి. ఆ ఇంటిని వెదికి ప‌ట్టుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది.

* మ‌హేష్ డాడీగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకొన్నారు. ఈ సెల‌క్ష‌న్ ఎవ‌రిది?
- నిజానికి క‌థ రాసుకొన్న‌ప్పుడు ఎవ్వ‌రినీ అనుకోలేదు. ఆ స‌మ‌యంలోనే లెజెండ్ రిలీజ్ అయ్యింది. అందులో జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న చూసి షాకయ్యాం. మహేష్ కూడా జ‌గ‌ప‌తిబాబు అయితే ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుంది అని చెప్ప‌డంతో జ‌గ‌ప‌తిని ఒప్పించాం.

-  కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka