Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

పదహారణాల తెలుగమ్మాయిలా రకుల్‌

Rakul Preetsingh looks like pure telugu girl

తెలుగు భాష అమృతం లాంటిదని వాళ్ళూ వీళ్ళూ చెప్పడమేగానీ మన హీరోయిన్లు మాత్రం ఆ అమృతాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. తెలుగు హీరోయిన్లు టెల్గులో మాట్లాడుతుంటే పరాయి భాషల హీరోయిన్లు మన తెలుగుని నేర్చుకుని ఎంతో స్పష్టంగా తెలుగుని ఉచ్ఛరించేందుకు ప్రయత్నిస్తూ ముచ్చటగొలుపుతున్నారు. తాను కూడా అతి త్వరలోనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటానంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెబుతుంటే మురిసిపోతున్నారు తెలుగు భాషాభిమానులు. నిత్యామీనన్‌ లాంటి కొందరు అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుని, తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ తమ సినిమాలకు తామే డబ్బింగ్‌ కూడా చెప్పుకోవడం జరుగుతోంది.

అయితే తెలుగు హీరోయిన్లకు తెలుగులో కన్నా ఇతర భాషల్లో ఎక్కువ అవకాశాలొస్తున్నాయి. తెలుగు నిర్మాతలు తెలుగమ్మాయిలను ప్రోత్సహించడంలేదన్న విమర్శ కూడా ఉంది. అదలా ఉంచితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాను తెలుగమ్మాయినైపోయానంటుంది. బాలీవుడ్‌ సినిమాతో నటిగా కెరీర్‌ ప్రారంభించిన రకుల్‌, తెలుగు సినిమాలకే పరిమితమైపోయింది. రామ్‌చరణ్‌తో ఓ సినిమా, ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్న రకుల్‌, ఇంకో నాలుగైదు సినిమాలు చేస్తూ తెలుగులో అత్యంత బిజీ హీరోయిన్‌గా మారింది. 

మరిన్ని సినిమా కబుర్లు
hatsoff to anushka