Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
A for Akhil - Powerful

ఈ సంచికలో >> సినిమా >>

వచ్చేస్తున్నాడు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'

Pawan Kalyan's Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అభిమానులకు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇవ్వబోతోంది. పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2 కావడంతో, ఆ రోజు సినిమా టీజర్‌ని రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారట. శరద్‌మరార్‌ ఈ చిత్రానికి నిర్మాత. కెఎస్‌ రవీంద్ర (బాబి) ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్‌ లుక్‌ ఫొటో అభిమానుల్లో సినిమాపై అంచనాల్ని పెంచేయగా, ఆ అంచనాల్ని ఆకాశమెత్తు పెంచేలా 'టీజర్‌'ని డిజైన్‌ చేశారట. సరిగ్గా సెప్టెంబర్‌ 1 అర్థరాత్రి 12 గంటలకు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారని సమాచారమ్‌.

పవన్‌కళ్యాణ్‌ సరసన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్‌తో కాజల్‌కి ఇదే తొలి సినిమా. బాలీవుడ్‌ మూవీ 'దబాంగ్‌'కి రీమేక్‌గా వచ్చిన 'గబ్బర్‌సింగ్‌' తెలుగులో పెద్ద విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' వస్తున్నప్పటికీ, ఇది పూర్తిగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఉంటుందట. టాలీవుడ్‌ రికార్డుల్ని తిరగరాసేలా ప్రిపేరవుతున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఏ స్థాయిలో అభిమానుల్ని అలరించనుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
raj Tarun is best