Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Rakul Preetsingh looks like pure telugu girl

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క గట్స్‌కి హేట్సాఫ్‌

hatsoff to anushka

ఏ హీరోయిన్‌ అయినా గ్లామరస్‌ పాత్రలనే ఒప్పుకుంటుంది. కెరీర్‌ ఇబ్బందుల్లో పడ్డప్పుడే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల గురించి ఆలోచిస్తారు. అనుష్క అలా కాదు. గ్లామరస్‌ హీరోయిన్‌గా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నా, డీ గ్లామర్‌ పాత్రలకు ఓకే చెప్పింది. 'బాహుబలి' తొలి పార్ట్‌లో అనుష్క అందవికారంగా కనిపించింది. మహరాణిలా అనుష్కని చూద్దామనుకున్న అభిమానులు నిరాశపడలేదు, అనుష్క గట్స్‌కి హేట్సాఫ్‌ అన్నారు. అక్కడితో అనుష్క ఆగలేదు, 'సైజ్‌ జీరో' సినిమా కోసం బాగా లావెక్కి కనిపించింది.

ఈ సినిమా నిర్మాణంలోనే అనుష్క గ్రేట్‌నెస్‌ గురించి ఎన్నో ప్రశంసలు. అనుష్క గొప్ప నటి ఏమీ కాదు, ఆమె తన హుందాతనంతోనే తను చేసే సినిమాలకు హైప్‌ తీసుకొస్తోంది. 'మిర్చి', 'అరుంధతి' చేసినా, 'బాహుబలి' చేసినా 'సైజ్‌ జీరో', 'రుద్రమదేవి' సినిమాలు చేస్తున్నా దేనికదే ప్రత్యేకం. సుదీర్ఘమైన కెరీర్‌లో అనుష్క ఎన్నోరకాల పాత్రలు పోషించింది, ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. హేట్సాఫ్‌ టు అనుష్క. 

మరిన్ని సినిమా కబుర్లు
A for Akhil - Powerful