Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hatsoff to anushka

ఈ సంచికలో >> సినిమా >>

ఎ ఫర్‌ అఖిల్‌.. పవర్‌ఫుల్‌

A for Akhil - Powerful

అక్కినేని కుటుంబం నుంచి మరో నట వారసుడు హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అతనే అక్కినేని అఖిల్‌. బాల నటుడిగా 'సిసింద్రీ' సినిమాలో నటించిన అఖిల్‌, పవర్‌ఫుల్‌ హీరోగా వినాయక్‌ డైరెక్షన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి 'అఖిల్‌' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పవర్‌ ఆఫ్‌ జువా ట్యాగ్‌లైన్‌. హీరో నితిన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై. పక్కా మాస్‌ అఖిల్‌ అని 'అఖిల్‌' పోస్టర్స్‌, స్టిల్స్‌ చూస్తే అర్థమవుతుంది. డాన్సులు, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ సినిమాలో అద్భుతంగా వచ్చాయట. వీటి కోసం అఖిల్‌ ఎంతో శ్రద్ధ తీసుకున్నాడని సమాచారమ్‌.

హీరోగా అక్కినేని అఖిల్‌ని పవర్‌ఫుల్‌ సినిమాతో లాంఛ్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే అఖిల్‌ తండ్రి నాగార్జున, ఆ బాధ్యతను మాస్‌ మూవీస్‌ స్పెషలిస్ట్‌ వినాయక్‌ చేతిలో పెట్టాడు. టైటిల్‌తో సినిమాపై ఇప్పటిదాకా ఉన్న హైప్‌ డబుల్‌ అయ్యిందంటున్నారు. మాస్‌ హీరోగా, లవర్‌ బోయ్‌గా డిఫరెంట్‌ లుక్స్‌తో అన్ని వర్గాల ఆడియన్స్‌ని అఖిల్‌ సినిమా రిలీజ్‌కి ముందే ఎట్రాక్ట్‌ చేయడం సినిమాకి పెద్ద ప్లస్‌. సినిమా పెద్ద హిట్‌ అయి తెరంగేట్రంతోనే రికార్డుల కింగ్‌గా అఖిల్‌ వార్తల్లోకెక్కాలని అతనికి విషెస్‌ అందించేద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
Pawan Kalyan's Sardar Gabbar Singh