Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kamal cheekatirajyam

ఈ సంచికలో >> సినిమా >>

చరణ్‌, రకుల్‌ కెమిస్ట్రీ అదుర్స్‌

charan, rakul chemistru adurs
చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రూస్‌ లీ'. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్‌తో చరణ్‌ దుమ్ములేపేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా విడుదలయిన మరో సాంగ్‌ మేకింగ్‌ వీడియోలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చాలా గ్లామరస్‌గా కన్పిస్తోంది. శ్రీనువైట్ల తన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేస్తాడు. కామెడీతోపాటు యాక్షన్‌, గ్లామర్‌కీ అంతే ప్రాధాన్యత వుంటుంది. 'బ్రూస్‌లీ' సినిమాలో కూడా శ్రీనువైట్ల ట్రేడ్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు, అన్ని కమర్షియల్‌ హంగులూ వుండనున్నాయి. 

తొలి టీజర్‌ యాక్షన్‌ బేస్డ్‌గా రూపొందిస్తే, రెండో టీజర్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చేలా రూపొందించారు. సాంగ్‌ మేకింగ్‌ టీజర్‌ గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఇవే కాకుండా, ఈ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ మెగాస్టార్‌ చిరంజీవి. డాన్సుల పరంగానూ చరణ్‌ ఈ సినిమాలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడట. మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఓ పాట, ఓ ఫైట్‌ వుంటుందట. అన్నిటికీ మించి ఈ సినిమాలో చరణ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అద్భుతంగా పండిందట. అదెలా వుంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాలి. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi choodddam