శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న రాం చరణ్ కొత్త సినిమా 'బ్రూస్‌లీ'. శ్రీను వైట్ల అంటేనే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు గుర్తొచ్చేస్తాయి. 'ఢీ' సినిమాతో మొట్టమొదటిసారిగా కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాను తెలుగు సినిమాకి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తరువాత చాలా సినిమాలు ఇదే తరహా ఫార్ములాను అనుసరించి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీనువైట్ల. రాంచరణ్ హీరోగా వస్తున్న 'బ్రూస్‌లీ' సినిమాతో మరో కొత్త ఫార్ములాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం శ్రీను వైట్ల చేస్తున్నాడట.
ఈ సినిమాలో చిరంజీవి పాత్రను ఆయన మలచిన తీరు ప్రత్యేకంగా ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాతోనే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తుండడం కూడా మరో విశేషం. చిరంజీవి తన 150వ సినిమాకి డైరెక్టర్‌గా ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలా? అని ఎదురు చూస్తున్న తరుణంలో సైలెంట్‌గా ఆ ఛాన్స్‌ని శ్రీనువైట్ల కొట్టేయ్యడం, ఈ ఛాన్స్ మిస్సయిన డైరెక్టర్స్‌కు కొంచెం అసూయగా కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది. టోటల్‌గా ఈ సినిమా ప్రస్తుత ఎంటర్‌టైన్‌మెంట్‌కి భిన్నంగా, అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వచ్చే నెల 16న విడుదలకు సిద్ధంగా ఉంది.
|