Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srinu vaitla got mega  chance

ఈ సంచికలో >> సినిమా >>

క్యాబ్‌ డ్రైవర్‌గా సాయి ధరమ్‌ తేజ్‌

sai dharma teja as cab driver
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా నటించబోతున్నాడు. ఈ సినిమాకు 'సుప్రీమ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సౌండ్‌ ఆఫ్‌ హారన్‌ అనేది క్యాప్షన్‌. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్‌ మరోసారి తన హీరోయిజాన్ని చూపించబోతున్నాడు. మేనమామ చిరంజీవికి అభిమానులు ముద్దుగా ఇచ్చుకున్న బిరుదు సుప్రీమ్‌ హీరో. ఇప్పుడు ఆ మామకి ముద్దుల మేనల్లుడైన సాయిధరమ్‌ సినిమాకు ఈ టైటిల్‌ పెట్టడం పట్ల మెగా అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో సాయిధరమ్‌ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని కూడా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ, యాక్షన్‌, వినోదం తదితర విషయాలతో పాటు ఊహించని సెంటిమెంట్‌ కూడా ఈ సినిమాలో ఉంటుందట. దిల్‌ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో రాశి ఖన్నా ఒక అందమైన పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనుందట. వచ్చే నెల 5 నుంచి ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. సాయిధరమ్‌తేజ హీరోగా వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' హిట్‌ దిశగా దూసుకుపోతోంది. 
మరిన్ని సినిమా కబుర్లు
chiru act in krish direction